దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీ అయింది చిత్రబృందం. ఈ క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో తమ స్టైలింగ్ తో ఆకట్టుకుంటున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఎన్టీఆర్, చరణ్ ల కాస్ట్యూమ్స్ కి అభిమానూలు ఫిదా అవుతున్నారు. వారి స్టైలిష్ ఫోటో కలెక్షన్స్ ఇక్కడ చూసేయొచ్చు.