రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ గాయత్రి అలియాస్ డాలీ డి క్రూజ్ మృతి. డాలీ మృతిపై ఎమోషనల్ అవుతున్న సురేఖా వాణి, షణ్ముఖ్ జస్వంత్ తదితరులు అనే వార్త చదివే ఉంటారు. రెండు మూడు రోజులుగా డాలీ పేరు ఎక్కువ వినపడుతోంది. ఎవరీ డాలీ? ఆమె కథేంటి? తెలుసుకోండి. 



గాయత్రి అలియాస్ డాలీ డి క్రూజ్ హైదరాబాద్ అమ్మాయి.

సురేఖా వాణి ఇన్‌స్టా పోస్టుతో డాలీ మృతి వార్త ప్రేక్షకులకు తెలిసింది.

సురేఖా వాణి కుమార్తె సుప్రీత, డాలీ క్లోజ్ ఫ్రెండ్స్. సురేఖా వాణి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఒకసారి గోవా వెళ్లొచ్చారు.

డాలీ పుట్టినరోజుకు సురేఖా వాణి ఒకసారి అటెండ్ కూడా అయ్యారు. 

ఫేమస్ యూట్యూబర్, నటి వైష్ణవి చైతన్యకు కూడా డాలీ క్లోజ్. ఇద్దరూ కలిసి ఒకసారి స్పెషల్ ఫొటోషూట్ చేశారు.  

డాలీ డి క్రూజ్ నవ్వుకు, కళ్లకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

యూట్యూబ్ / షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం మొదలుపెట్టిన తర్వాత తన పేరును గాయత్రి డాలీగా మార్చుకున్నారు డాలీ డి క్రూజ్ 

డాలీకి మూగ జీవాలు అంటే ఎంతో ప్రేమ. ఒక కుక్కపిల్లను ఆమె పెంచుకొనేవారు. 

నటి సురేఖా వాణి తనకు తల్లి లాంటివారు అని, సెకండ్ మదర్ అని డాలీ చెప్పేవారు. 

'స్పై గాళ్ ఫ్రెండ్', 'మ్యారేజ్ బ్యూరో' వంటి షార్ట్ ఫిలిమ్స్ చేశారు గాయత్రి.

'పెళ్లి కాని ప్రసాద్', 'మేడమ్ సార్ మేడమ్ అంతే' వెబ్ సిరీస్ లు డాలీకి మంచి పేరు తీసుకొచ్చాయి. 

ఆహా ఓటీటీ ఒరిజినల్ యూట్యూబ్ సిరీస్ 'సామజవరగమన'లోనూ డాలీ నటించారు. ఆమె మరణంతో ఆ పాత్రను కట్ చేస్తారేమో? చూడాలి. 

షణ్ముఖ్ జస్వంత్ తో కూడా డాలీ నటించారు. అందులో 'సాఫ్ట్ వేర్ పెళ్లి చూపులు' ఒకటి.

ఎక్కువగా ఇన్‌ఫినిట‌మ్‌ సంస్థ నిర్మించిన షార్ట్ ఫిలిమ్స్ లో డాలీ నటించారు.

హొలీ రోజున గాయత్రి (డాలీ డి క్రూజ్) రోడ్డు ప్రమాదంలో మరణించారు.

రోహిత్ అనే వ్యక్తి మితిమీరిన వేగంతో కారు నడపడమే ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. 

ప్రమాద సమయంలో కారు నడిపిన రోహిత్ మద్యం సేవించినట్టు సమాచారం 

గాయత్రి  డాలీ కొన్ని చిత్రాల్లో నటించారు. ఆమె మరణవార్త పలువుర్ని కలిచివేసింది.  

యూట్యూబ్‌లో మంచి పేరు తెచ్చుకుని, సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న తరుణంలో గాయత్రి మరణించడం దురదృష్టకరమని అభిమానులు అంటున్నారు.

ఇదీ గాయత్రి అలియాస్ డాలీ డి క్రూజ్ కథ. (All Images courtesy: Dolly D Cruze / Instagram)