వైవాహిక జీవితం బావుండాలా? ఇలా చేయండి ఈ తొమ్మిది అలవాట్లు ఉంటే మ్యారీడ్ లైఫ్ అదిరిపోతుంది. వైవాహిక జీవితంలో లైంగిక కలయిక చాలా ముఖ్యం. అది యాంత్రికంగా ఉండకూడదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మానసిక బంధం కూడా గట్టిపడుతుంది. ఇద్దరూ రోజూ ఓ గంటసేపైనా మాట్లాడుకోవాలి. ఆ రోజు వారిద్దరికీ ఎదురైన సంఘటనల గురించి పంచుకోవాలి. గొడవొచ్చినప్పుడు ఎవరో ఒకరు సైలెంట్‌గా ఉండిపోవాలి. అలా అయితే గొడవ పెరగదు. రోజులో ఒక్కపూటైనా ఇద్దరూ కలిసి భోజనం చేయండి. అది బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇద్దరూ కలిసి పనులు చేయడం, వర్క్‌ని పంచుకోవడం చేయాలి. వంట కూడా ఇద్దరూ కలిసిమెలిసి చేసుకోవాలి. వినడం అనేది ఒక ఆర్ట్. వైవాహిక జీవితంలో అది చాలా అవసరం. ఒకరు చెబితే మరొకరు వినాలి. మధ్యలో అడ్డుతగలకూడదు.