యాపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్ ఎస్ఈని మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.43,900 నుంచి ప్రారంభం కానుంది. మిడ్‌నైట్, స్టార్‌లైట్, (ప్రొడక్ట్) రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతానికి యాపిల్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2022) పనిచేయనుంది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన యాపిల్ 5జీ ఫోన్ ఇదే. ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌నే యాపిల్ ఇందులో కూడా అందించింది.