గూగుల్ ఐ/వో సదస్సు ఈ సంవత్సరం మేలో జరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మే 11వ తేదీ, 12వ తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంను ఈ సదస్సులో ప్రకటించనున్నారు. అమెరికాలో మౌంటెయిన్ వ్యూలోని షోర్‌లైన్ యాంఫీథియేటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. వర్చువల్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. గూగుల్ క్రోమ్, గూగుల్ మ్యాప్స్, ట్రాన్స్‌లేషన్, గూగుల్ అసిస్టెంట్, ఇంకా మరిన్ని అంశాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆడియో, విజువల్ పజిల్‌ను కూడా గూగుల్ విడుదల చేసింది.