‘RRR’ టీమ్ ఇప్పుడు దేశమంతా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సీరిస్‌తో పోల్చితే ఈ సినిమాకు ఎన్నడూలేనంతగా ప్రచారం చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ప్రచారం కల్పించలేదు. ‘RRR’తో పోల్చితే ‘బాహుబలి’పై అప్పట్లో ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉండేవి. దీంతో ప్రచారానికి పెద్ద శ్రమించలేదు. ‘బాహుబలి’తో ప్రేక్షకాధరణ పొందిన రాజమౌళి ‘RRR’పై కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా ‘బాహుబలి’ స్థాయిలో హిట్ కావాలని ఇద్దరు హీరోలతో తీరికలేకుండా ప్రచారం కల్పిస్తున్నారు. RRR ప్రమోషన్స్ కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు ప్రైవేట్ జెట్‌లోనే తిరుగుతున్నారు. దుబాయ్‌కు కూడా వెళ్లి RRRకు గట్టిగానే ప్రచారం చేశారు. కేవలం ప్రమోషన్లకే RRR టీమ్ రూ.20 కోట్లు ఖర్చు చేశారని ఇండస్ట్రీ టాక్. ‘బాహుబలి’కి కూడా ఈ స్థాయిలో ప్రచారం చేయలేదట. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను ఇతర రాష్ట్రాల ఇవెంట్స్‌కు కూడా తరలిస్తున్నారట. అభిమానులను తరలించేందుకు రూ.2-3 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. Images and Videos Credit: RRR Movie