Diabetic Healthy Breakfast: మీరు మధుమేహ రోగులా? షుగర్ లేవల్స్ అదుపులో ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తిని చూడండి
నచ్చిన ఆహారం తింటే షుగర్ లేవల్స్ పెరుగుతాయి అని చాలా మంది మధుమేహ రోగులు భయపడుతూ ఇష్టం లేకపోయినా నచ్చని ఆహారాన్ని తీసుకుంటారు.
నచ్చిన ఆహారం తింటే షుగర్ లేవల్స్ పెరుగుతాయి అని చాలా మంది మధుమేహ రోగులు భయపడుతూ ఇష్టం లేకపోయినా నచ్చని ఆహారాన్ని తీసుకుంటారు. ఇంతక ముందు వారసత్వంగా మాత్రమే షుగర్ వ్యాధి వస్తుందని అంటారు. కానీ ఇప్పుడు మాత్రం వయసు భేదం లేకుండా చిన్న వయస్సులో వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. అందుకు కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే ఇక అవి తినకూడదు, ఇవి తినకూడదు అని భయపడతారు. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల షుగర్ పెరిపోతుందని ఆందోళన చెందుతారు. మరీ ముఖ్యంగా మొదట వచ్చే ఆలోచన ఏం తినాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూనే కార్బోహైడ్రేట్స్ తో కూడిన ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఐదు అల్పాహారాలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. రుచిగా ఉండటమే కాదు షుగర్ లేవల్స్ కూడా అదుపులోను ఉంచుతుంది.
మెంతి పరోటా
ప్రోటీన్, ఫైబర్ మరియు మంచి కార్బోహైడ్రేట్లు మెండుగా ఉండే మేతి పరోటా మధుమేహ రోగులకి చాలా మంచి ఆహారం. ఇది తినడం వల్ల మీకు మంచి పోషకాలు అందించడంతో సకత్తి కూడా ఇస్తుంది. కొద్దిగా గోధుమ పిండిలో కొంచెం కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, వామ్ము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మెంతి ఆకులు వేసుకుని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఆ పిండి ననిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలాగా రుద్దుకుని నెయ్యితో పరోటా మాదిరిగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు షుగర్ లేవల్స్ అదుపులో ఉండేలాగా చేస్తుంది.
బేసిన్ మేతి చిలా
ఇది శనగ పిండితో చేసుకునేది. మెంతి ఆకులని జోడించి దోస మాదిరిగా చేసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఈ అల్పాహారం డయాబెటిక్ రోగులకి చాలా మంచిది. సనగపిండిలో మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, వామ్ము, మెంతి ఆకులు వేసుకుని దోస పిండిలాగా కలుపుకోవాలి. చాలా త్వరగా అయిపోయే హెల్తీ, టేస్టి బ్రేక్ ఫాస్ట్ ఇది.
ఉడికించిన కోడిగుడ్లు
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తప్పని సరిగా కోడిగుడ్డుని అల్పాహారంలో భాగం చేసుకోవాలి. ఆమ్లెట్, వేపుడుగా కాకుండా ఉడికించిన కోడిగుడ్లు తినడం చాలా ఉత్తమం. ఒకవేళ ఉడికించిన గుడ్లు తినడం కష్టంగా అనిపిస్తే కొద్దిగా నూనె వేసి అందులో లైట్ గా ఉడికించిన గుడ్లు వేసి వాటికి ఉప్పు, కారం జోడించి తీసుకుంటే రుచిగా ఉంటుంది.
కాలా చన ఛాట్
దాదాపు అందరూ పోషకాహార నిపుణులు సనగలతో చేసిన ఛాట్ తినమని సలహా ఇస్తారు. అది డయాబెటిక్ రోగులకి చాలా మంచిది. శనగలను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాలి. వాటిని పొద్దునే కుక్కర్లో వేసి ఉడికించుకుని అందులో కొద్దిగా బంగాళాదుంప ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ, మిర్చి ముక్కలు, మసాలా ఛాట్ వేసుకుని తాలింపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
రాగి దోస
షుగర్ పేషెంట్స్ రాగి పిండితో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిది. రాగి పిండి, గోధుమ పిండిని కొద్దిగా తీసుకుని అందులో మజ్జిగ వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ పిండిటో దోసలు వేసుకోవాలి. దీన్ని గ్రీన్ చట్నీ తో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ బ్రేక్ ఫాస్ట్ రెసిపి తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు
Also read: ఆల్కలీన్ ఆహారాలు ఏమిటో తెలుసా? ఇవి తినడం చాలా ముఖ్యం
Also Read: ట్రావెల్ చేస్తున్నప్పుడు వాంతులు అవుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి