Alkaline Foods: ఆల్కలీన్ ఆహారాలు ఏమిటో తెలుసా? ఇవి తినడం చాలా ముఖ్యం
Healthy Foods: అన్ని రకాల ఆహారాలు తినడం ఎంత ముఖ్యమో, వాటిలో ఆల్కలీన్ ఉండే ఆహారాలు తినడం కూడా ప్రధానమే.
Healthy Foods: ఇనుము అధికంగా ఉండే ఆహారాలు, విటమన్ ఎ ఉండే ఆహారాలు... ఇలా ప్రత్యేకంగా ఎలా చెప్పుకుంటామో ఆల్కలీన్ ఆహారాలు కూడా అంతే. ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్కలీన్ ఉండే ఆహారాలు తినడం వల్ల అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పదార్థాలు యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ సమయంలో మన పొట్టలో విడుదలయ్యే గ్యాస్ట్రిక్ ఆమ్లం కొంచెం అధికంగా విడుదలవుతుంది. కాబట్టి ఆల్కలీన్ ఉండే ఆహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. మన అదృష్టం కొద్దీ భారతీయ భోజనంలో అన్ని సమపాళల్లోనే తింటాము.ముఖ్యం ఆల్కలీన్ ఉండే పదార్థాలు కూడా ఉంటాయి. ఆల్కలీన్ అధికంగా లభించే ఆహారాలు ఇవిగో...
టోఫు
టోఫుకి, పనీర్ కి మధ్య చాలా మందికి తేడా తెలియదు. పనీర్ పాలు లేదా సోయాతో కూడా తయారు చేస్తారు. కానీ టోఫుని కేవలం సోయా పాలతోనే తయారుచేస్తారు. పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థపై ఆమ్ల ప్రభావాన్ని కలిగిస్తాయి. టోఫు ఆల్కలీన్ ను అధికంగా కలిగి ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్‌ను నివారించడానికి పనీర్ కు బదులు టోఫు వంటకాలు తినాలి.
చిలగడ దుంప
చిలగడదుంపలు శీతాకాలంలో అధికంగా లభిస్తాయి. ఇవి అధిక ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ స్వభావం పొట్టలోని మంట, వాపులతో పోరాడుతుంది. మంటను నయం చేసి ఆరోగ్యాన్నిస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ లక్షణాలు అధికం.
సముద్రపు ఉప్పు
సముద్రపు ఉప్పులో ఇనుము, పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే ఆల్కలీన్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి వస్తుంది. వంట చేసేటప్పుడు ఈ ఉప్పును ఉపయోగించడం మంచిది.
పుట్టగొడుగులు
పుట్టగొడుగుల్లో అధిక ఆల్కలీన్ ఉంటుంది. ఇది తరచుగా యాసిడ్ బౌట్స్, అసిడిక్ రిఫ్లక్స్ తో బాధపడుతున్న వ్యక్తులు తమ ఆహారంలో పుట్టగొడుగులను భాగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది శరీరంలో ఆల్కలీన్ ను పెంచుతుంది.
బ్రౌన్ రైస్
బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ ఎంపిక బ్రౌన్ రైస్. గుండె మంటను తగ్గించడంలో ఇది ముందుంటుంది. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ తక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఆల్కలీన్ లక్షణాలు ఎక్కువ. అన్నిరకాలుగా బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యం.
కాలిఫ్లవర్
కాలీఫ్లవర్లో ఆల్కలీన్ లక్షణాలు అధికం. ఈ విషయం చాలా మందికి తెలియదు. కాలీ ఫ్లవర్ తినడం వల్ల ఆల్కలీన్ శరీరంలోని పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనిలోని ఆల్కలీన్ లక్షణాలు క్యాన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
Also read: పాదాలకు వేసుకునే సాక్సులో ఉల్లిపాయలు పెట్టుకుంటే నిజంగానే జలుబు, జ్వరం తగ్గిపోతాయా?
Also read: ఉప్పును ఆహారంపై చల్లుకుని తినేవారికి ఇదే హెచ్చరిక, అది ముందస్తు మరణానికి కారణం కావచ్చు