X

భలే ఆఫర్.. ఆ ఇళ్లల్లో ఒంటరిగా ఉంటే నిమిషానికి రూ.12 చెల్లిస్తారట, కానీ.. అంత ఈజీ కాదు

వారు చెప్పే ఇంట్లో ఒంటరిగా 24 గంటలు గడిపితే మీరు ఒక్క రోజే రూ.16 వేలు నుంచి రూ.17 వేలు వరకు సంపాదించుకోవచ్చు.

FOLLOW US: 

నం ఏదైనా హోటల్ లేదా గెస్ట్ హౌస్‌లలో ఉంటే.. డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే సంగతి మీకు తెలిసిందే. కానీ, ఇక్కడ రివర్స్. రియెల్ ఎస్టేట్ సంస్థలు చూపించే కొన్ని ఇళ్లల్లో మీరు బస చేస్తే.. డబ్బులు చెల్లించక్కర్లేదు. పైగా.. వాళ్లే మీకు డబ్బులు చెల్లిస్తారు. అది నిమిషానికి ఇంత అని చెల్లిస్తారు. అదేంటీ.. ఎవరైనా పూటల్లో లెక్కిస్తారు లేదా రోజులు, నెలల్లో లెక్కిస్తారు. వీరేంటి వెరైటీగా నిమిషాల్లో లెక్కిస్తున్నారు.. అనేగా మీ సందేహం? ఎందుకంటే.. వారు చూపించే ఇళ్లల్లో సాధారణ వ్యక్తులు నివసించడం సాధ్యం కాదు. ముఖ్యంగా పిరికివాళ్లు అస్సలు ఉండలేరు. ఒక వేళ ధైర్యం చేసిన వెళ్లినా.. 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేరు. అబ్బా.. అంత సీనుందా అనేగా.. అంటున్నారు. అయితే, మీరు ఆ ఇళ్లల్లో ఏముంటాయో తెలుసుకోవలసిందే. 

చైనాలో రియల్ ఎస్టేట్ సంస్థలు.. ధైర్యవంతులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వారు చూపించే ఇళ్లలో కనీసం ఒక రోజు ఒంటరిగా గడిపితే చాలు.. నిమిషానికి ఒక యువాన్ (సుమారు రూ.12) చొప్పున చెల్లిస్తారు. ఇంతకీ ఆ ఇళ్లు ఏమిటో తెలుసు? భూత్ బంగ్లాలు. ఔనండి, చైనాలో ఇలాంటి భవనాలు చాలానే ఉన్నాయట. అసాధారణ మరణాలు జరుగుతున్నాయని కొందరు, ప్రేతాత్మలు తిరుగుతున్నాయని మరికొందరు.. ఇళ్లను వదిలేసేవారి సంఖ్య చైనాలో ఎక్కువేనట. వాటిని అమ్మే బాధ్యతను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. 

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్.. ఆమె స్పందన ఇదీ!

అయితే.. అలాంటి ఇళ్లను అమ్మడమంటే ఎంత కష్టమో తెలిసిందే. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ ఇంట్లో భూతాలు.. ప్రేతాత్మలు లేవని నిరూపించేందుకు ఒకరిని ఒక రాత్రంతా ఆ ఇంట్లో ఉంచుతున్నారు. వారు ఆ ఇంట్లో ఎంత సేపు ఉంటే అంత సంపాదించుకోవచ్చని ఆశ చూపుతున్నారు. దీంతో డబ్బులకు ఆశపడి చాలామంది ఇలాంటి ఇళ్లల్లో రాత్రింబవళ్లు బస చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా భూత్ బంగ్లాల్లో గడిపే వ్యక్తులను ‘హాంటెడ్ హౌస్ టెస్టర్స్’ అని పిలుస్తున్నారు. వీరు విజయవంతంగా ఆ ఇళ్లల్లో 24 గంటలు గడిపితే.. ఆ ఇల్లు సేఫ్ అని నిర్ధరిస్తారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కొనుగోలుదారులకు చూపించి.. అమ్మేస్తారు. దీంతో చాలామంది దీన్ని పార్ట్‌టైమ్ జాబ్‌గా మార్చుకున్నారట. ధైర్యవంతులు మాత్రమే.. అలాంటి ఇళ్లలో ఉండేందుకు ముందుకొస్తున్నారట. 

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: Haunted House Tester Haunted House Tester Job Haunted House Tester in China China Haunted House Tester చైనా

సంబంధిత కథనాలు

Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో!

Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో!

Pakistan Train Driver: పెరుగు కోసం రైలు ఆపేసిన ట్రైన్ డ్రైవర్.. వీడియో వైరల్

Pakistan Train Driver: పెరుగు కోసం రైలు ఆపేసిన ట్రైన్ డ్రైవర్.. వీడియో వైరల్

Bold Trend: బ్లౌజ్ లేదు, కానీ ఉన్నట్టే లెక్క... అదే ‘మెహెందీ బ్లౌజ్’

Bold Trend: బ్లౌజ్ లేదు, కానీ ఉన్నట్టే లెక్క... అదే ‘మెహెందీ బ్లౌజ్’

Secrets: అన్ని విషయాలు అందరితో చెప్పేయకండి... వీటిని రహస్యంగా ఉంచండి

Secrets: అన్ని విషయాలు అందరితో చెప్పేయకండి... వీటిని రహస్యంగా ఉంచండి

Bone Soup Benefits: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

Bone Soup Benefits: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

టాప్ స్టోరీస్

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?

Mi 17V Helicopter :  వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?