అన్వేషించండి

SugarCane Juice: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

చెరుకు రసాన్ని పరగడుపున తాగమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

వేసవిలో చెరుకు రసం తాగే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది, కాబట్టి ఈ చెరుకు రసాన్ని ఎక్కువమంది తాగేందుకు ఇష్టపడుతున్నారు. దీన్ని హిందీలో ‘గన్నే కా జ్యూస్’ అని పిలుస్తారు. ఒక గ్లాసు చెరుకు రసంతో రోజును ప్రారంభిస్తే ఎన్నో రకాల ఆరోగ్యాన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఎక్కువమంది టీ తోనే తమ రోజును ప్రారంభిస్తారు. బదులుగా రోజూ చెరుకు రసాన్ని తాగి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. 

ఈ తీపి పానకం అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాలుగా ఆయుర్వేద సంప్రదాయ మందుల్లో చెరుకు రసాన్ని వాడుతున్నారు. దీన్ని తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

తక్షణమే శక్తి...
చెరుకు రసం ఒక ఎనర్జీ డ్రింక్. దీనిలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. అధిక చక్కెర కంటెంట్ కారణంగా ఇది తాగిన వెంటనే శక్తిని అందిస్తుంది. ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఈ శక్తి శరీరం అంతటా పాకుతుంది. ఇది మీరు ఆరోగ్యకరంగా రోజును కిక్ స్టార్ట్ చేసేందుకు సహకరిస్తుంది.

వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్య బారిన పడుతూ ఉంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు చెరుకు రసాన్ని తాగితే మంచిది. ఇది దాహాన్ని తీర్చే అద్భుతమైన పానీయం. నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో నుంచి బయటికి పోయిన ద్రవాలను తిరిగి నింపేందుకు సహకరిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను, ట్యాక్సీన్లను బయటికి పంపిస్తుంది. 

చెరుకు రసంలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తాయి. ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా నిర్వహించడంలో సహకరిస్తాయి. మలబద్దకాన్ని అడ్డుకుంటాయి. పేగు కదలికలను చురుకుగా చేసి జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. కాబట్టి ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే శరీరం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. 

చెరుకు రసం చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి అకాల వృద్ధాప్యాన్ని రాకుండా నివారిస్తాయి. 

బరువు తగ్గాలనుకునే వారికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. ఖాళీ పొట్టతో దీన్ని తాగినప్పుడు త్వరగా పొట్ట నిండిన భావనని ఇస్తుంది. కాబట్టి ఆ రోజు ఎక్కువగా ఆహారం తినాలన్న కోరిక తగ్గుతుంది. 

Also read: ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం

Also read: సీనియర్ ఎన్టీఆర్‌కు ఇడ్లీలంటే ఎంత ఇష్టమో, ఆయన మెనూలో ఉండే ఆహారాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget