జుట్టు ద్వారా గుండె జబ్బుల రాకను కనిపెట్టవచ్చా?



గుండె జబ్బులకు ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి అధికంగా ఉంటే గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



జుట్టులో ఒత్తిడి హార్మోను స్థాయిని కొలవడం ద్వారా భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు.



జుట్టులో గ్లూకోకార్టికైడ్ స్థాయిలు తెలుసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని అంచనా వేయొచ్చు.



దీర్ఘకాలిక ఒత్తిడి కేవలం గుండెనే కాదు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.



ఒత్తిడి వల్ల శరీరం మొత్తం పాడవుతుంది. అవయవాల పనితీరు క్షీణిస్తుంది.



గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి భవిష్యత్తులో హెయిర్ అనాలసిస్ ఉత్తమ పరీక్ష.



ఇది భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



జుట్టు ఊడుతున్నా కూడా దానికి ఒత్తిడి ఒక ప్రధాన కారణం.