ఖాళీపొట్టతో బొప్పాయి తింటే బరువు తగ్గొచ్చు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఖాళీ పొట్టతో పరగడుపున దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ A,B,C ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బొప్పాయిలో లూటిన్, జియాక్సంతిన్ అనే కెరటోనోయిడ్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ ఉదయాన్నే బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ పొట్టతో బొప్పాయిని తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి ఉత్తమమైన పండు. రోజూ ఉదయాన్నే బొప్పాయి తింటే బరువు తగ్గే ప్రక్రియ సులభతరం అవుతుంది. దీన్ని తినడం వల్ల చిరుతిండి తినే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.