అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య కొలెస్ట్రాల్. ఇది పెరగడం వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది.
అందుకే దాన్ని తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు కలిపి తీసుకోండి.


వెల్లుల్లి, ఉల్లిపాయ రెండింటిలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలని కలిగి ఉంటుంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.


ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది.



బాదం పప్పులు గుండెకి ఆరోగ్యకరమైన మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వు, ప్రోటీన్ ని అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది



బాదంతో కలిపి పెరుగు తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు 4 శాతం వరకు తగ్గుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది.



గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.



గ్రీన్ టీలో నిమ్మకాయ కలిపి తీసుకుంటే రీఫ్రెష్ గా అనిపిస్తుంది.



చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలోపప్పులు సమర్థవంతంగా పని చేస్తాయి.



బ్రౌన్ రైస్ లో పోషక విలువలు ఎక్కువ. పప్పుతో కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది