వారానికి ఒక పిజ్జా తింటే జరిగేది ఇదే



పిజ్జా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో ఒకటి. ఇది జంక్ ఫుడ్ కేటగిరిలోకే వస్తుంది.



వారానికోసారి పిజ్జా తినడం అలవాటుగా మార్చుకుంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్టే.



పిజ్జా తినడం వల్ల సంతృప్త పువ్వులు ఎక్కువగా శరీరంలో చేరే అవకాశం ఉంది. అలాగే పిజ్జా బేస్‌ను మైదాతో తయారుచేస్తారు. ఇది మరీ ప్రమాదకరం.



సాదా చీజ్ పిజ్జాలో ఒక ముక్క తింటే శరీరంలో 400 క్యాలరీలు చేరుతాయి. మొత్తం తింటే 2000 క్యాలరీలు చేరే అవకాశం ఉంది. ఇది డేంజర్.



పిజ్జాలో ప్రాసెస్ చేసిన మాంసాలను పైన వాడతారు. ఇవి అధిక కొవ్వును కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల పేగు, పొట్ట క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది.



వారానికి ఒకసారి తినే బదులు నెలకి ఒకసారి తినండి. దీనివల్ల ఎక్కువగా హాని కలగదు.



పిజ్జా తిన్న రోజు ఇతర ఆహారాలను తగ్గించండి. దీనివల్ల శరీరంలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉండదు.



బయట మైదాతో చేసిన బేస్ దొరుకుతుంది. మీరు గోధుమ పిండితో తయారు చేసిన బేస్‌ను తయారు చేసుకొని ఇంట్లోనే పిజ్జాను రెడీ చేయండి.


Thanks for Reading. UP NEXT

రక్త ప్రసరణను మెరుగపరిచే ఆహారాలు ఇవిగో

View next story