ఆ ఒక్క యాప్‌లోనే రూ.25 కోట్ల మామిడి వ్యాపారం వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు మార్కెట్లో కుప్పలుగా పోసి అమ్ముతారు. ఇది ఎంతోమందికి ప్రియమైన పండు. కొంతమంది మార్కెట్లలో నేరుగా కొంటే, మరికొందరు డెలివరీ యాప్‌లలో కూడా మామిడి పండ్లను ఆర్డర్ పెడుతున్నారు. అలాంటి ఒక యాప్ జెప్టో. దీనిలో ఏకంగా పాతిక కోట్ల రూపాయల మామిడి పండ్లను ఆర్డర్ చేసినట్టు చెబుతోంది జెప్టో. ఒక్క నెలలోనే పాతిక కోట్ల రూపాయల విలువైన మామిడి పండ్లను ఆర్డర్ చేశారు. అంటే ఒక్క రోజుకు 60 లక్షల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నమాట. మిగతా ఈ కామర్స్ సైట్లు, స్థానిక మార్కెట్లలో అంతకుమించి పండ్లు అమ్ముడుపోయి ఉంటాయి. 30 శాతం మంది ఆల్ఫోన్సో జాతి పండ్లను ఆర్డర్ చేశారు. తరువాత పాతిక శాతం మంది బంగినపల్లి మామిడి పండ్లను ఆర్డర్ చేశారు. మామిడి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.