ఇలాంటి మామిడి పండ్లను తింటే అంతే సంగతులు



మామిడి సీజనల్ పండు. కేవలం ఎండాకాలంలోనే లభిస్తుంది. కాబట్టి దీన్ని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.



కొంతమంది విక్రయదారులు రసాయనాలను ఉపయోగించి మామిడిని అసహజంగా పండిస్తున్నారు. వీటి వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి.



రసాయనాలతో పండిన మామిడి పండ్లను తింటే వాంతులు, విరేచనాలు, విపరీతమైన బలహీనత, ఛాతీలో మంట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.



మామిడిని పండించేందుకు వాడే రసాయనాలు మన శరీరంలో చాలా దూకుడుగా ప్రతిస్పందిస్తాయి. చర్మంపై దురదలు, పూతలు వచ్చే అవకాశం ఉంది.



కంటి చూపు కూడా దెబ్బతినవచ్చు. గొంతులో ఇబ్బంది అనిపిస్తుంది. మింగడం కష్టంగా మారుతుంది.



కళ్ళల్లో మంటలు, గొంతు మంట మొదలవుతుంది. శ్వాస లోపాలు, పుండ్లు పడడం, దగ్గు వంటివి కూడా కలుగుతాయి.



మామిడి పండ్లను తిన్న వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే అవి రసాయనాలతో పండిన పండ్లని అర్థం.



అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.