అన్వేషించండి

Diet Changes to Reduce Gas : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే

Digestive health : వయసు పెరిగే కొద్ది, ఇతరత్రా కారణాల వల్ల చాలామందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. అలాంటి వారు ఈ డైట్​ ఫాలో అయితే మంచిదట. 

Natural Remedies for Gas and Bloating Relief : జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? కడుపు ఉబ్బరంగా మారి, గ్యాస్ పెరిగిపోయిందా? అయితే మీరు మీ డైట్​ని మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ ఈ సమస్యను మరింత పెంచుతాయి. కొన్ని ఫుడ్స్ సమస్యను కంట్రోల్ చేస్తాయి. పూర్తిగా ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన డైట్​ ఏంటి? ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

గ్యాస్ సమస్యని దూరం చేసే ఫుడ్స్

  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ గ్యాస్​ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి జీర్ణక్రియకు మంచివి.
  • నీటిని పుష్కలంగా తాగితే కూడా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్​ సమస్యను దూరం చేయడంతో పాటు.. మలబద్ధకం తగ్గుతుంది.
  • అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్​ని తగ్గిస్తాయి.
  • పుదీనా ఆయిల్ లేదా పుదీనాతో చేసిన టీ తాగితే కండరాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా జీర్ణ సమస్యలను దూరం చేసి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
  • యోగర్ట్ హెల్త్​ గట్​ని ప్రమోట్ చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంతో పాటు జీర్ణసమస్యలు రాకుండా కాపాడుతుంది.
  • పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని కంట్రోల్​లో ఉంచుతాయి.
  • సోంపు కూడా గట్ హెల్త్​కి మంచిది. అందుకే భోజనం చేసిన తర్వాత దీనిని ఎక్కువమంది తీసుకుంటారు. ఇది గ్యాస్​ సమస్యను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
  • పైనాపిల్, చమోలీ టీల్లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. 

గ్యాస్​ని తగ్గించే చిట్కాలు..

  • ఫుడ్​ని ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినండి. అంటే ఎక్కువ ఫుడ్ తినమని అర్థంకాదు. మీరు రెగ్యులర్​గా తీసుకునే ఫుడ్​నే తక్కువ తక్కువగా తీసుకోవాలని అర్థం. 
  • కార్బోనేటెడ్ డ్రింక్స్ గ్యాస్​కు కారణమవుతాయి. ఈ విషయం తెలియక చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. పైగా వాటి వల్ల గ్యాస్ బయటకి పోతుంది అనుకుంటారు. కానీ ఉన్న గ్యాస్​ని ఇది రెట్టింపు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
  • కార్బోహైడ్రెట్లు, పులియబెట్టిన(మజ్జిగ), మోనో శాచ్యూరేటెడ్ వంటివి జీర్ణ సమస్యలను పెంచుతాయి. గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తాయి. 

గ్యాస్ సమస్యని పెంచే ఫుడ్స్ ఇవే

పప్పులు, బీన్స్ వంటివాటిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నా ఇవి కొందరిలో జీర్ణ సమస్యలను పెంచుతాయి. బ్రకోలీ, కాలీ ఫ్లవర్, క్యాబేట్ వంటివి కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కొందరికి పాల ఉత్పత్తులు అంతగా పడవు. సెన్సిటివిటీని పెంచుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. యాపిల్స్, పియర్స్, ఉల్లిపాయ కూడా కొందరిలో జీర్ణ సమస్యలను పెంచుతాయి.

గమ్స్ తినే అలవాటు మానుకోవాలి. చూయింగ్ గమ్స్ వల్ల కూడా కడుపు ఉబ్బరం పెరుగుతుంది. తినే ఆహారాన్ని స్లోగా నమిలి మింగాలి. గబగబా తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఈ చిట్కాలతో జీర్ణసమస్యలు కంట్రోల్ అవ్వకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.

Also Read : ఉప్పుల్లోని రకాలు.. వాటి ఉపయోగాలు.. దేనిని వాడితే వంటకు రుచి పెరుగుతుందో తెలుసా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget