అన్వేషించండి

Types of Salt : ఉప్పుల్లోని రకాలు.. వాటి ఉపయోగాలు.. దేనిని వాడితే వంటకు రుచి పెరుగుతుందో తెలుసా?

Different Types of Salt : ఉప్పులేని వంటకం ఉండదు. ఉప్పు లేకుంటే రుచి ఉండదు. అయితే మీకు ఉప్పుల్లోని రకాలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

Types of Salt for Cooking : వంటలో ఉప్పు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. అయితే ఉప్పు మంచి రుచిని ఇస్తుంది కానీ.. ఎక్కువగా దానిని తీసుకోకపోవడమే మంచిదంటారు నిపుణులు. అలాగే కొందరు రెగ్యులర్​ ఉప్పుకి బదులుగా పింక్ సాల్ట్ తీసుకుంటే మంచిదంటారు. ఉప్పులో ఇతర రకాలు ఉంటాయా? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

ఆహారం వండడం, వండిన ఆహారాన్ని నిల్వ చేయడంలో ఉప్పు కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి రుచిని, వంటకు కొత్తదనాన్ని ఇస్తుంది. అయితే మీరు రోజూవారి వంటలో ఎలాంటి ఉప్పు వంటకు ఏ రకమైన ఉప్పు వేస్తే మంచిదో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కోషర్ ఉప్పు

కోషెర్ ఉప్పును తక్కువగా రిఫైండ్ చేస్తారు. కాబట్టి స్వచ్ఛమైన సోడియం క్లోరైడ్​గా చెప్తారు. పైగా ఇది అయొనైజ్డ్​ కాదు. కాబట్టి ఫుడ్​ని సీజనింగ్ చేయడానికి ఇది మంచిదని చెప్తారు. అంటే ఆహారాన్ని స్టోర్ చేయడానికి ఇది మంచిది. అయితే దీనిని బేకింగ్​కు ఉపయోగించకూడదట. 

టేబుల్ సాల్ట్ 

రెగ్యులర్​గా ఉపయోగించే ఉప్పుల్లో టేబుల్ సాల్ట్ ఒకటి. ఇదే కరెక్ట్​ ఉప్పు అనుకుంటారు కానీ.. ఇది సహజమైన ఉప్పు కాదట. ఈ సాల్ట్​ని ప్రాసెస్ చేస్తారట. దీనిలో ఖనిజాలు ఉండవు. అయితే దీనిలో అయోడిన్, యాంటీకేకింగ్ ఏజెంట్లు ఉంటాయి. దీనిని మైనింగ్ నిక్షేపాల నుంచి తీస్తారట. మసాలాలు, వంటలు, బేకింగ్​కి ఇది మంచి ఆప్షన్. 

సముద్రపు ఉప్పు

సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఈ ఉప్పును తయారు చేస్తారు. అయితే దీనిని టేబుల్ సాల్ట్​ కంటే తక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల ఈ ఉప్పులో ఖనిజాలు ఉంటాయి. ఇది ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది. ఇతర ఉప్పుల కంటే మంచి వ్యత్యాసం ఉంటుంది. 

పింక్ సాల్ట్ 

హిమాలయాలకు దగ్గరగా ప్రాంతాల నుంచి ఈ ఉప్పును సేకరిస్తారు. దీనిలో సోడియం, ఐరన్, జింక్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. టేబుల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్​ మరింత ఉప్పగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఉప్పు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. సాస్​లు తయారు చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్నిరకాల వంటలకు ఇది మంచిదని చెప్తారు. 

రెడ్ సాల్ట్ 

రెడ్ సాల్ట్​నే అలియా సాల్ట్ అంటారు. దీనిని హవాయి ద్వీపం నుంచి వచ్చిన అగ్ని పర్వత మట్టితో తయారు చేస్తారు. ఇది 80 కంటే ఎక్కువ ఖనిజాలతో నిండి ఉంటుంది. పైగా ఐరన్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ తేలికపాటి లవణం సున్నితమైన రుచిని ఇస్తుంది. మాంసం, చేపలకు, మసాలా చేయడానికి.. వాటిని నిల్వ ఉంచడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పైగా ఇది వంటలకు రంగునిస్తుంది. పైగా మంచి సువాసన కూడా ఇస్తుందట. ఫ్రై రెసిపీలకు ఇది బెస్ట్ ఆప్షన్. 

బ్లాక్ సాల్ట్ 

నల్ల ఉప్పును హిమాలయాల నుంచి తయారు చేస్తారు. అక్కడ అగ్నిపర్వత శిల నుంచి ఒక రకమైన రాతి ఉప్పును తయారు చేస్తారు. ఈ ఉప్పులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకే దీనిని తక్కువ మోతాదులో ఉపయోగించాలి. కూరలు, మసాలా వంటలు, ఊరగాయలు, సలాడ్స్​కి ఇది మంచి రుచిని ఇస్తుంది. 

ఫ్లేవర్డ్ సాల్ట్ 

ఫ్లైవర్డ్ సాల్ట్​లో ఉప్పు, మాసాలా పొడి, మూలికలతో నిండి ఉంటుంది. ఇవి డిష్​ రుచిని పెంచడంలో, టేస్ట్​ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. మీ డిష్​కి రుచిని పెంచాలనుకున్నప్పుడు దీనిని ట్రై చేయవచ్చు. మాంసం, పౌల్ట్రీ, చేపలు, కూరగాయలను స్టోర్ చేయడానికి కూడా ఇది మంచిదని చెప్తారు. 

ఫ్లూర్ డి సెల్, సెల్టిక్ సముద్ర ఉప్పు, ఫ్లైక్ సాల్ట్, బ్లాక్ లావా సాల్ట్, స్మోక్డ్ సాల్ట్ వంటివి రకాలు వాడుకలో ఉన్నాయి. వీటిని కూడా వంటల్లో ఉపయోగిస్తారు. మీకు నచ్చిన ఉప్పును.. మీకు ఇష్టమైన వంటలకు ఉపయోగించుకుని.. రుచిని ఆస్వాదించేయండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఉప్పును తక్కువ తీసుకోవడమే మంచిది. అది ఏది అయినా. కాబట్టి నిపుణుల సలహా తీసుకుని ఉప్పును తీసుకుంటే బెటర్. 

Also Read : ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్షు పెంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. వాటిని దూరంగా ఉంచండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget