Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Morning GYM vs Evening Workout : బరువు తగ్గాలన్నా.. కండరాలు మెరుగుపరిచి స్ట్రెంత్ పెంచుకోవాలన్నా.. జిమ్ ఎప్పుడు చేయాలి? ఉదయం చేస్తే మంచిదా? సాయంత్రం చేయాలా? పరిశోధనలు, నిపుణులు ఇచ్చే సూచనలు ఇవే..

- కండరాల అభివృద్ధికి మీ దినచర్యకు సరిపోయే సమయాన్ని ఎంచుకోవాలి.
Best Time To Workout For Weight Loss : జిమ్‌కు వెళ్లాలనుకునే చాలామందికి ఉండే డౌట్ ఉదయం వర్కవుట్ చేయడం మంచిదా? లేక సాయంత్రం చేస్తే బెటరా? బరువు తగ్గడం నుంచి కండరాల పెరుగుదల వరకు ఏ సమయం మంచిది అనే విషయంపై చాలామందికి సందేహం ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు మాత్రం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. మీరు ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నారన్న దానికంటే.. ఎంత రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తున్నారనేది ముఖ్యమని చెప్తున్నాయి.
ఉదయం జిమ్ చేసినా.. లేదా సాయంత్రం జిమ్ చేసినా.. మీరు కంటిన్యూగా చేయడమే ఇంపార్టెంట్ అంటున్నాయి. మరి బరువు తగ్గడానికి ఎప్పుడు జిమ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి? కండరాల పెరుగుదల కోసం ఏ సమయంలో వ్యాయామం చేయాలో.. పరిశోధలను ఇస్తోన్న సూచనలు ఏంటో చూసేద్దాం.
బరువు తగ్గేందుకు..
2026లో ప్రచురితమైన సిస్టమాటిక్ రివ్యూ, మెటా-అనాలిసిస్‌లో 10 ర్యాండమైజ్డ్ అధ్యయనాల్లో పాల్గొన్న 402 మంది ఫలితాలను పరిశీలించారు. దీనిలో భాగంగా ఉదయం లేదా మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేసినవారిలో.. బరువు, నడుము కొలత, కొవ్వు శాతంలో స్పష్టమైన తేడా కనిపించలేదు. కాబట్టి ఎప్పుడూ వ్యాయామం చేసినా.. బరువు తగ్గవచ్చని ఈ రివ్యూ హైలెట్ చేసింది.
అధిక బరువు ఉన్నవారు ఎప్పుడు చేయాలి?
100 మంది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిపై జరిగిన 12 వారాల ర్యాండమైజ్డ్ ట్రయల్‌లో.. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేసిన రెండు గ్రూపుల్లోనూ బరువు తగ్గడం గుర్తించారు. ఉదయం వ్యాయామం చేసినవారు సగటున 2.7 కిలోలు, సాయంత్రం చేసినవారు 3.1 కిలోలు తగ్గినా.. ఒక సమయం మరొకదాని కంటే బెటర్ అని పరిశోధకులు నిర్ధారించలేదు. కాబట్టి వ్యాయామం ఎప్పుడూ చేసినా మంచి ఫలితాలు చూడవచ్చు.
Also Read : జిమ్ చేసిన తర్వాత ఒళ్లు నొప్పిగా ఉందా? మొదట్లో బాడీ పెయిన్స్ రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఉదయమే జిమ్ చేస్తే..
ఉదయం వ్యాయామం చేస్తే రోజువారీ పనులు, ఆఫీస్ మీటింగ్స్ లేదా ఇతర ప్లాన్లు వర్కవుట్‌కు అడ్డంకి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రానికి జిమ్‌కు వెళ్లడం కుదరని వారికి ఉదయం జిమ్‌కి వెళ్లడం మంచి ఎంపిక అవుతుంది.
సాయంత్రం జిమ్ చేస్తే కలిగే లాభాలు
రోజంతా శరీరం కదలికలో ఉండటం వల్ల సాయంత్రానికి కండరాలు బాగా వార్మ్ అయి ఉంటాయని కొందరు భావిస్తారు. అయితే స్ట్రెంగ్త్ లేదా ఎండ్యూరెన్స్ మెరుగుదలకు ఒక నిర్దిష్ట సమయమే ఉత్తమమని ప్రస్తుత పరిశోధనలు స్పష్టంగా చెప్పడం లేదు. కాబట్టి క్రమంగా ఒకే సమయంలో శిక్షణ తీసుకోవచ్చు. దీనివల్ల కండర పనితీరు మెరుగుపడుతుంది.
అయితే సాయంత్రం జిమ్ చేయడం తప్పు కాదు కానీ.. నిద్రకు చాలా దగ్గరగా అధిక తీవ్రతతో కూడిన వ్యాయామం చేస్తే కొందరికి నిద్రపై ప్రభావం పడవచ్చు. మీ వర్కవుట్ తర్వాత నిద్ర సరిగా పడకపోతే సమయాన్ని కొంచెం ముందుకు మార్చుకోవడం మంచిది.
Also Read : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
మీ రొటీన్‌కి సరిపోయే టైమ్ బెస్ట్..
సిస్టమాటిక్ రివ్యూలో భాగంగా 35 అధ్యయనాల్లో పాల్గొన్న 17 రిజల్ట్స్ పరిశీలించి.. ఉదయం వ్యాయామం మెరుగైనదని కొన్ని అధ్యయనాలు.. సాయంత్రం వ్యాయామం మెరుగైనదని మరికొన్ని అధ్యయనాలు తెలిపాయి. మిగిలిన వాటిలో స్పష్టమైన తేడా కనిపించలేదు. అంటే అందరికీ ఒకే బెస్ట్ టైమ్ ఉండదని ఈ పరిశోధన సూచిస్తోంది. మీకు స్టైస్ లేకుండా చేసుకోగలిగే సమయం ఏదైనా మంచిదేనని చెప్తోంది.
క్రమం తప్పకుండా చేయడమే ఇంపార్టెంట్..
వారానికి రెండు రోజులు ఉదయం జిమ్ చేసి.. మిగిలిన రోజులు మానేయడం కంటే మీకు వీలైన సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. బరువు తగ్గడం కోసం వ్యాయామంతో పాటు ఆహారం, నిద్ర, రోజువారీ శారీరక శ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించుకోవాలంటున్నారు.
Also Read : జిమ్ చేసినా పొట్ట తగ్గట్లేదా? అయితే ఈ 5 సూప్స్‌తో చెక్ పెట్టండి.. ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీలు ఇవే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























