అన్వేషించండి

Sugar: తీపి పదార్థాలు తగ్గించుకోండి, లేకుంటే చర్మంపై ముడతలు రావడం ఖాయం

తీపి పదార్థాలు తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది.

తీపి పదార్థాలు తినడమంటే ఎంతో మందికి ఇష్టం. రకరకాల స్వీట్లు నోరూరిస్తాయి. వాటిని రోజూ తినేసే వారు ఎంతో మంది. అధికంగా స్వీట్లు తినేవారికి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అలాగే చర్మ సౌందర్యం కూడా తగ్గుతుంది. చర్మానికి తీపి పదార్థాలు ఎంతో హాని చేస్తాయి. చక్కెరతో చేసిన ఆహారాన్ని అతిగా తినడం వల్ల మొటిమలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో పండ్లు, తాజా కూరగయాలు, పాలకూర, చేపలు, నట్స్ వంటివి అధికంగా తినాలి. వీటిని తరచూ తింటుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది. తీపి కోరికలను చంపుకోవాల్సిన అవసరం ఉంది. పోషకాహార నిపుణులు తీపి పదార్థాలను తక్కువ తినమని సిఫారసు చేస్తున్నారు. స్వీట్లు అధికంగా తినడం వల్ల చర్మంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెబుతున్నారు.  

మొటిమలు
అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్ పెరుగుతుంది. ఇది చర్మంపై మొటిమల రూపంలో బయటపడుతుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఇది అదనపు సెబమ్ ఉత్పత్తికి కారణమవుతుంది. ఈ సెబమ్ రంధ్రాలను మూసేస్తుంది.  దీనివల్ల మొటిమలు కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. ముఖంపై అధికంగా మొటిమలు వచ్చేస్తాయి. 

ముడతలు 
స్వీట్లలో ఉండే చక్కెర గ్లైకేషన్ అనే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ చక్కెర అణువులు చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్‌లతో కలుస్తాయి. దీని వల్ల ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. స్వీట్లు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. పెరిగిన ఇన్సులిన్‌ల ద్వారా అధునాతన గ్లైకేషన్ ఎండ్-ప్రొడక్ట్స్ (AGEs) నిర్మాణం పెరుగుతుంది. ఈ AGEలు కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్‌లను దెబ్బతీస్తాయి. దీని చర్మం ముడతలు పెరిగిపోతాయి. 

జిడ్డు
అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిలో పెరుగుదలకు దారితీస్తుంది. పెరిగిన ఇన్సులిన్ స్థాయిలు సేబాషియస్ గ్రంధులను మరింతగా సెబమ్ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. ఈ అదనపు సెబమ్ వల్ల  చర్మం జిడ్డుగా మారుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల చర్మం మరింత జిడ్డుగా కనిపిస్తుంది. చర్మం నిస్తేజంగా మారుతుంది.

పంచదార నిండిన పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. కాబట్టి వారానికో ఒక స్వీటుతో సరిపెట్టుకోవాలి. పంచదారతో చేసే స్వీట్లు కన్నా బెల్లంతో చేసిన పదార్థాలు తింటే ఎంతో మేలు. 

Also read: మీరు కూర్చునే టాయిలెట్ సీట్ కంటే మీరు వాడే ఈ వస్తువుల మీదే బ్యాక్టీరియా ఎక్కువ

Also read: తీపి కాకరకాయ నిల్వ పచ్చడి, డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget