టమోటాలు అధికంగా తింటే ఇంత ప్రమాదమా? టమోటో వంటల్లో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఏ కూర వండినా అందులో టమాటా ముక్కలు పడాల్సిందే. టమోటోలను అధికంగా తింటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి పేగులలో ఆమ్లత్వాన్ని నింపుతాయి. మితంగా తీసుకుంటే టమోటాలు మేలే చేస్తాయి. కానీ ఎక్కువగా టమోటోలు నిండిన ఆహారాన్ని తింటే ఈ ఆమ్లాలు గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తికి కారణం అవుతాయి. కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా టమోటోలను తక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ కీళ్లల్లో వాపును పెంచుతాయి. టమోటోలు తినడం వల్ల చర్మ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. టమోటోలో స్కిన్ ర్యాష్‌కు దారి తీసే సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల తుమ్ములు, గొంతులో చికాకుగా ఉండడం, నాలుక మంట పెట్టడం, నోటిలో ఇబ్బందిగా ఉండడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. టమోటాలను అధికంగా తింటేనే పైన చెప్పిన సైడ్ ఎఫెక్టులన్నీ వస్తాయి. అదే మితంగా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి.