గోళ్లు విరిగిపోతున్నాయా? ఇదే కారణం శరీరంలో మన ఆరోగ్యాన్ని సూచించే అవయవాల్లో గోళ్లు కూడా ఒకటి. అవి పెళుసుగా మారిపోతున్నా, రంగు మారుతున్నా, ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. విటమిన్ బి7 లోపం వల్ల గోళ్లు ఇలా మారిపోయే అవకాశం ఉంది. ఇనుము లోపంతో బాధపడుతున్నా కూడా గోళ్లు పెళుసుగా మారి, చీలిపోతూ ఉంటాయి. జింక్ అనేది గోరు పెరుగుదలకు, గోర్ల మరమ్మతుకు అవసరమైన ఖనిజం. దీని లోపం వల్ల గోరు పెరుగుదలలో అడ్డంకులు వస్తాయి. ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లం గోళ్లకు చాలా అవసరం. అవి లోపిస్తే గోళ్లు సులువుగా విరిగిపోతాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ... వంటి శక్తివంతమైన విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు వంటివి గోళ్ళను రక్షిస్తూ ఉంటాయి. గోళ్ల కోసం క్యారెట్లు, చిలగడ దుంపలు, సిట్రస్ పండ్లు, బెర్రీలు, నట్స్, అవిసె గింజలు, చియా గింజలు, వాల్ నట్స్ వంటివి తినాలి.