అన్వేషించండి

మీరు కూర్చునే టాయిలెట్ సీట్ కంటే మీరు వాడే ఈ వస్తువుల మీదే బ్యాక్టీరియా ఎక్కువ

మీరు వాడే ఈ వస్తువులపై ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా?

బ్యాక్టీరియా, వైరస్ వంటివి ప్రాణాంతక రోగాలకు కారణం అవుతాయి. అందుకే పరిశుభ్రంగా ఉండమని చెబుతూ ఉంటారు వైద్యులు. అయితే మీకు తెలియకుండానే మీరు బ్యాక్టీరియా, వైరస్‌లు నివాసం ఉండే వస్తువులను రోజూ వాడుతున్నారు. టాయిలెట్ సీట్ కంటే మీరు రోజు వాడే ఈ వస్తువులే ఎంతో మురికిగా ఉంటాయి. శాస్త్రీయ అధ్యయనాలలో కొన్ని రకాల వస్తువులు టాయిలెట్ సీట్ కంటే ఎంత అధికంగా బ్యాక్టీరియా, వైరస్‌ను కలిగి ఉంటాయో చెబుతున్నారు పరిశోధనకర్తలు. ఇవి ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం.

తలగడ కవర్
అమెరికాకు చెందిన పరుపుల కంపెనీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఒక వారం పాటు ఉతక్కుండా ఉండే తలగడలో సగటు టాయిలెట్ సీటు మీద ఉన్న బ్యాక్టీరియా కంటే 17వేల రెట్ల బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.

మొబైల్ 
వివిధ అధ్యయనాల ప్రకారం మీ స్మార్ట్ ఫోన్ పై టాయిలెట్ సీటు కంటే సగటున 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. మీ చేతుల్లో నిరంతరం ఉండే ఈ ఫోను ఎక్కువ సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. దీన్ని శుభ్రం చేయాలంటే యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌తో తుడవడం చాలా ముఖ్యం. లేకుంటే ఫోన్ మీద నుంచి ఉన్న బ్యాక్టీరియా శరీరంలో చేరడం చాలా సులువు.

కీబోర్డు
బ్యాక్టీరియా నిండిన వస్తువు కీబోర్డు. ఒక కీబోర్డ్ పై చదరపు అంగుళానికి 3,000 బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే దీన్ని కూడా తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. వీటిని యాంటీబ్యాక్టీరియల్ వైప్స్‌తో తుడుస్తూ ఉండాలి. అలాగే వ్యాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించి లోపల ఉన్న డస్ట్‌ని క్లీన్ చేయాలి.

మౌస్
కంప్యూటర్లు వాడే ప్రతి ఒక్కరికి మౌస్ వాడడం అలవాటు. ఈ మౌస్ పై చదరపు అంగుళానికి 1500 బ్యాక్టీరియాలను నివసిస్తున్నట్టు అంచనా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మౌస్‌ను కూడా యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ తుడుస్తూ ఉండాలి.

రిమోట్ కంట్రోల్
పెద్దలతో పాటు పిల్లలు కూడా రిమోట్ కంట్రోల్‌ను అధికంగా వాడతారు.రిమోట్ కంట్రోల్ పై చదరపు అంగుళానికి 200 బాక్టీరియాలు ఉంటాయి. వీటిని తరచూ తాకడం వల్ల అవి శరీరంలో చేరే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి.

డోర్ హ్యాండిల్స్
బాత్రూంకు ఉండే తలుపు హ్యాండ్స్ వేర్వేరు వ్యక్తులు తాకుతూ ఉంటారు. ఇక పబ్లిక్ వాష్ రూమ్  అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఆ డోర్ హ్యాండిల్స్‌ పై ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. వీటిని ఎప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలి.

నీటి కుళాయిలు
వీటిని కూడా ఎంతోమంది తాగుతూ ఉంటారు. దీనివల్ల అవి సూక్ష్మక్రిములకు కేంద్రంగా మారుతాయి. కాబట్టి మీరు చేతులు కడుక్కునేటప్పుడు నీటి కుళాయిలను కూడా డిటర్జెంట్ లేదా సబ్బుతో శుభ్రం చేయడం చాలా మంచిది.

ఫ్రిజ్ డోర్
నమ్మినా నమ్మకపోయినా రిఫ్రిజిరేటర్‌కు ఉండే డోర్ పై కూడా చదరపు అంగుళానికి 500 కు పైగా బ్యాక్టీరియాలో ఉంటాయి. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనకర్తలు పరిశోధన చేసి మరి తేల్చారు. కాబట్టి రిఫ్రిజిరేటర్‌‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

Also read: తీపి కాకరకాయ నిల్వ పచ్చడి, డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget