గాజు గ్లాస్‌లోనే ఆల్కహాల్ ఎందుకు తాగాలి? ఆల్కహాల్, కాక్ టైల్, విస్కీ వంటివన్నీ కూడా గాజు గ్లాసుల్లోనే సర్వ్ చేస్తారు. సాధారణ గ్లాసుల్లో వాటిని తాగే వారి సంఖ్య చాలా తక్కువ. ఆల్కహాల్‌ను ఇలా గాజు గ్లాస్‌లోనే ఎందుకు తాగాలి? దీనికి శాస్త్రీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గ్లాస్‌తో తయారు చేసిన వస్తువులు చక్కగా ఉంటాయి. అందులో వేసిన ఆహారాలను చూస్తే నోరూరేలా కనిపిస్తాయి. గాజు గ్లాసు తటస్థ లక్షణాలను చూపిస్తుంది. అంటే అందులో వేసిన ఆహారాలతో ఎలాంటి రసాయనా సంబంధాలను కలిగి ఉండదు. ఈ గ్లాసు పారదర్శకంగా ఉంటుంది. అందులో వేసిన ఆల్కహాల్ రంగు స్పష్టంగా కనిపిస్తుంది. కాషాయం రంగులో ఉండే విస్కీ అయిన, క్రిస్టల్ క్లియర్‌గా కనిపించే వోడ్కా అయినా గాజు గ్లాసులో తమ రూపాన్ని, రంగును ఏమాత్రం మార్చుకోకుండా అలానే కనిపిస్తాయి. గాజు గ్లాసులో వేసిన ఆల్కహాల్ ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అంటే గది ఉష్ణోగ్రతకు త్వరగా వచ్చేయదు. గాజు అనేది నాన్ పోరస్. అంటే బయటి వాసన, రుచి, బ్యాక్టీరియా వంటి వాటిని త్వరగా గ్రహించదు.