Innerwear Suggestions : లోదుస్తుల కోసం ఏ వయసు వారు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలో తెలుసా? అది అయితే అందరికీ బెస్ట్
Innerwear : లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. సరైనవి ఎంచుకోకపోతే.. ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు. ఏ వయసు వాళ్లు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకుంటే మంచిదో తెలుసా?
Best Innerwear for Men and Women : లోదుస్తులు. వాడుక భాషలో చెప్పాలంటే బనియన్స్, అండర్‌వేర్స్, బ్రా. నిపుణులు చెప్పేది ఏంటంటే.. బయట వేసుకునే దుస్తులు ఎలాంటివి వేసుకున్నా.. లోపల ధరించే ఇన్నర్స్ విషయంలో కాంప్రిమైజ్ అవ్వకూడదంటున్నారు. లోపలే ఉంటాయి కదా అని చాలామంది ఇన్నర్‌వేర్‌పై అంతగా శ్రద్ధ వహించరు. తక్కువ ధరకు వచ్చేవాటిని, క్వాలిటీ లేని వాటిని ఎంచుకుంటారు. ఇలా చేస్తే పలురకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వయసు ప్రకారం కొన్నిరకాల లో దుస్తులను మీ వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవాలంటున్నారు. అయితే ఏ వయసువారు ఏ ఫ్యాబ్రిక్ వాడితే మంచిదో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో? ఎలాంటివి ఎంచుకుంటే ఇబ్బందులు రావో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండేళ్లలోపు వారికి..
అప్పుడే పుట్టిన పిల్లలకు స్కిన్ సెన్సిటివ్‌గా ఉంటుంది. కాబట్టి వారికి కాటన్, వెదురు దుస్తులు లేదా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ ఇన్నర్స్ వాడితే మంచిది. ఇది స్కిన్‌పై మృదువుగా ఉంటుంది. ఇరిటేషన్, ఇబ్బందిని కలిగించదు.
2-5 ఏళ్ల వారికి..
2 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో పెరుగుదల, మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కంఫర్ట్బుల్, స్ట్రెచ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. కాటన్, పాలిస్టర్, స్పన్డెక్స్ బ్లెండ్స్ దుస్తులు పిల్లలకు ఇబ్బంది లేకుండా మూమెంట్స్‌కు ఆటంకం కలగకుండా హెల్ప్ చేస్తాయి. స్నాప్ బటన్స్, జిప్ డిజైన్స్ ఉండే లో దుస్తులు మంచిది.
5 నుంచి 12 ఏళ్లవారికి
బ్రీతబుల్, మాయిశ్చర్ విక్కింగ్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. అంటే కాటన్, పాలిస్టర్, నైలాన్ వంటివి చర్మాన్ని డ్రైగా, కంఫర్టబుల్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. నడుము దగ్గర వైడ్‌గా వచ్చే లో దుస్తులను ఎంచుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్, గాలి ఆడేందుకు అనువుగా ఉంటాయి.
13 నుంచి 19 ఏళ్లవారు
తేమను దూరం చేసే కాటన్, పాలీస్టర్, నైలన్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్స్ ఇన్నర్‌వేర్‌ను ట్రెండీ డిజైన్స్‌లో తీసుకోవచ్చు. వీటిని తీసుకునే ముందు కచ్చితంగా ట్రైల్ వేసుకోవాలి. సపోర్టివ్‌గా, ఫిట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
20 నుంచి 39 ఏళ్లవరకు
ఈ వయసువారు హై క్వాలిటీ, గాలి బాగా ఆడే ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. కాటన్, వెదురు ఫ్యాబ్రిక్, సిల్క్ క్లాత్‌లను ఎంచుకోవచ్చు. నడుము దగ్గర వైడ్‌గా ఉండే సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్, ఫోర్ వే స్ట్రెచ్ చేయగలిగే ఫ్యాబ్రిక్స్‌ను లో దుస్తులుగా ఎంచుకోవాలి.
40 నుంచి 64 ఏళ్లవరకు
కాటన్, పాలిస్టర్, నైలాన్ వంటి కంఫర్ట్‌నిచ్చే ఇన్నర్‌వేర్‌ను ఎంచుకోవాలి. సపోర్టివ్‌గా, రిలాక్స్డ్గా ఉంచే డిజైన్స్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి.
65 దాటితే..
చర్మానికి ఇబ్బంది కలిగించని ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. కాటన్, వెదురు ఫ్యాబ్రిక్, సిల్క్ వంటివి స్కిన్‌కు ఇబ్బంది కలిగించవు. ఇలాంటి ఇన్నర్స్ ఎంచుకుంటే ఈజీగా వేసుకోగలిగే వాటిని మాత్రమే తీసుకోవాలి.
మీరు సరిగ్గా గమనిస్తే అన్నింట్లోనూ కామన్‌గా కాటన్ ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్స్‌ను లోదుస్తులుగా ఉపయోగిస్తే గాలి మంచిగా ఆడుతుంది. అలాగే లోపల చెమట వంటివి పట్టినా.. ప్రైవేట్ పార్ట్స్‌కి ఇబ్బంది కలగించకుండా చెమటను ఇది అబ్జార్వ్ చేస్తుంది. దీనివల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.
Also Read : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే