కొందరు ఎంతో ఇష్టంగా తెల్లని దుస్తులు కొనుక్కుంటారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ దుస్తులు రంగుమారిపోతూ ఉంటాయి. అందుకే వాటిని శుభ్రం చేసేప్పుడు కొన్ని ఫాలోఅయితే రంగు మారకుండా ఉంటుంది. నిమ్మకాయ నీటిలో వైట్ దుస్తులను నానబెడితే పసుపు రంగుపోతుంది. నిమ్మరసంలో ఓ ఆర్గానిక్ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది తెలుపుపై ఉన్న రంగును పోగొడుతుంది. అన్ని రంగుల దుస్తులతో కలిపి కాకుండా.. వాటిని సపరేటుగా ఉతకాలి. తెల్లని దుస్తులకు చాలామంది డిటార్జెంట్ ఉపయోగిస్తారు. ఇది దుస్తుల రంగు మార్చేస్తుంది. వైట్ డ్రెస్‌లకు డిటార్జెంట్ సోప్ కాకుండా.. లిక్విడ్ వాడితే మంచిది. (Image Source : Unsplash)