వెల్లుల్లిని మనం చాలా వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాము.

అయితే దీనిని వింటర్​లో తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమవుతుంది?

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వింటర్​లో ఇవి రెట్టింపు బెనిఫిట్స్ ఇస్తాయి.

ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి. సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి.

ఫ్రీ రాడికల్స్​ నుంచి శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడి ఇమ్యూనిటీని పెంచుతాయి.

చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచి.. చలిని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. (Images Source : Unsplash)