బాదం ఆరోగ్యవంతమైనవి. వీటిద్వారా కలిగే అన్ని ప్రయోజనాలు పొందాలంటే ఇక్కడ చెప్పే తప్పులు చెయ్యవద్దు. బాదం పప్పులు అతిగా తినడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయి. బరువు పెరుగతారు. కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. బాదం పప్పులు మోతాదుకు మించకుండా తినాలి. రోజుకు 6-8 బాదం పప్పలు తినవచ్చు. రుచి కోసం ఉఫ్పు, చక్కెర కలపడం, వేయించడం వల్ల పోషకాలు కోల్పోవచ్చు. నెలలో కొన్ని రోజుల విరామం పాటించవచ్చు. అప్పుడప్పుడు తినడం వల్ల ఆశించిన ఫలితాలు రావు. బాదం పప్పులను చల్లని పొడిగా ఉండే ప్రదేశాలలో గాలిచొరబడని డబ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు రిఫ్రిజిరేటర్లలో పెట్టుకోవచ్చు. నట్స్ అలెర్జీ ఉన్నవారు, మింగడంలో సమస్యలు ఉన్న వారు, కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు బాదం పప్పు తీసుకోవద్దు. Images courtesy : Pexels