గ్రీన్ బీన్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

తరచుగా గ్రీన్ బీన్స్ తీసుకున్నపుడు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

గ్రీన్ బీన్స్ లో ఫైబర్ ఎక్కువ. జీర్ణక్రియ సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది.

వీటిలోని ఫైబర్ వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతాయి. చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

గ్రీన్ బీన్స్ లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

నిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సి గ్రీన్ బీన్స్ లో ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు గ్రీన్ బీన్స్ లో మెండుగా ఉంటాయి.

Images courtesy : Pexels