కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అలాంటి ఆహారపదార్థాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తగు మోతాదులో అల్లం క్రమం తప్పకుండా తీసకుంటే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. జీర్ణవ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ ను కూడా నివారిస్తుంది.

ఓట్స్ వంటి ఇతర హోల్ గ్రెయిన్స్ తీసుకున్నపుడు వాటిలోని ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంటుంది.



టీని ఫర్మెంట్ చెయ్యడం ద్వారా తయారు చేసే కంబూచాలో ప్రొబయోటిక్స్ ఎక్కువ.

అవిసె గింజల్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. దీనిలో ఉండే ఇతర పోషకాలు కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పెక్టిన్ అనే ఫైబర్ తో పాటు రకరకాల పోషకాలు కలిగిన ఆపిల్ లో ప్రిబయోటిక్స్ కూడా ఉంటాయి.

ఉల్లిపాయలు గట్ బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. ఉల్లిలో ఇనులిన్ అనే ఇమ్యూనిటి పెంచే ప్రొబయోటిక్ ఉంటుంది.

కివి పండులో విటమిన్ సి పుష్కలం. ఈ విటమిన్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్దకం ఏర్పడకుండా నివారిస్తుంది.

ప్రొబయోటిక్స్ కలిగిన యోగర్ట్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇమ్యూనిటి పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

Images courtesy : Pexels