అవిసె గింజల్లో ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అవిసెగింజల్లో అల్ఫాలినోలెనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యవంతమైన ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్.

ఒక అధ్యయనం ప్రకారం ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అవిసెగింజల్లో మాంగనీస్, రాగి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పైబర్ పుష్కలంగా ఉంటాయి.

అవిసె గింజల్లో దొరికే లిగ్నాన్ ఒక రకమైన ప్లాంట్ పాలీ ఫెనాల్. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలు అందిస్తుంది.

వీటి వల్ల వయసు పెరిగే కొద్దీ జరిగే ఎముక నష్టాన్ని నివారించబడుతుంది. ఎముక సాంద్రతను కాపాడుతుంది.

అవిసె గింజలు తీసుకుంటే కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణ పెరుగుతుంది.

Images courtesy : Pexels