అన్వేషించండి

Brain Foods for Children : పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే.. ఈ ఆహారాలు డైట్లో ఉండాల్సిందే, పీడియాట్రిషియన్ సలహాలు ఇవే

Brain-Boosting Foods for Kids : పిల్లల మెదడుకు అవసరమైన ఇంధనం పోషకాహారమేనని.. వారి డైట్లో కొన్ని ఫుడ్స్ చేర్చితే జ్ఞాపకశక్తి మెరుగవుతుందని చెప్తున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిల్లల మెదడు అభివృద్ధికి పోషకాహారం చాలా ముఖ్యమని నిపుణులు తెలిపారు.
  • ఒమేగా-3, గుడ్లు, నట్స్, ఆకుకూరలు, పండ్లు జ్ఞాపకశక్తి పెంచుతాయి.
  • తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, నీరు అవశ్యకం, షుగర్ ఫుడ్స్ మానుకోండి.

Best Diet for Childrens Brain Development : పిల్లల మెదడు అభివృద్ధిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. బాల్యంలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడాలంటే సరైన పోషకాలు అందించడం అవసరం. అయితే ఒక్క రాత్రిలో పిల్లలను తెలివైన వారిగా మార్చే అద్భుతమైన ఆహారం ఏదీ లేకపోయినా.. సమతుల్యమైన పోషకాహారం వారి మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని చెప్తున్నారు నిపుణులు. 

పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలో అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్​లో కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, పీడియాట్రిషన్ చేస్తోన్న డాక్టర్ సత్యప్రియ సాహూ సూచనలు ఫాలో అవ్వచ్చు. అలాగే వేటికి దూరంగా ఉంచితే మంచిదో.. ఎలాంటి ఫుడ్స్ పెడితే మెదడు పనితీరు మెరుగవుతుందో చూసేద్దాం. 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు 

సాల్మన్, సార్డిన్స్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు కణాల ఎదుగుదలకు, వాటి మధ్య సమాచార మార్పిడికి కీలకంగా పనిచేస్తాయి. పిల్లలలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడంలో ఇవి సహాయం చేస్తాయి.

గుడ్లు 

గుడ్లలో ఉండే కోలిన్ (Choline) అనే పోషక పదార్థం జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే పిల్లల ఆహారంలో గుడ్లను చేర్చడం మంచిది.

నట్స్, సీడ్స్

బాదం, అక్రోట్లు, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి నట్స్, విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, జింక్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచి ఏకాగ్రతను పెంచడంలో సహాయపడతాయి.

పండ్లు 

బెర్రీలు, ఇతర పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడటంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు 

పాలకూర, కేల్, బ్రోకోలీ వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుదనాన్ని పెంచి పిల్లలను మానసికంగా అప్రమత్తంగా ఉంచుతాయి.

తృణధాన్యాలు

ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమల వంటి తృణధాన్యాలు మెదడుకు అవసరమైన స్థిరమైన శక్తిని అందిస్తాయి. దీంతో పిల్లలు రోజంతా చదువుపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు.

మిల్క్ ప్రొడెక్ట్స్

పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఎదుగుదలతో పాటు నరాల వ్యవస్థ ఆరోగ్యానికి కూడా అవసరం.

నీరు 

చాలామంది ఆహారంపైనే దృష్టి పెడతారు. కానీ సరిపడా నీరు తాగకపోతే పిల్లల మానసిక స్థితి, ఏకాగ్రత, పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. స్వల్ప డీహైడ్రేషన్ కూడా పిల్లల ఫోకస్​పై ప్రభావం చూపుతుంది.

దూరంగా ఉంచాల్సిన ఫుడ్స్ ఇవే

పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్స్ పెట్టడంతో పాటు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంచాలి. షుగర్స్ ఎక్కువగా ఉండే స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ పిల్లల శక్తి స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయని చెప్తున్నారు డాక్టర్ సత్యప్రియ సాహు. దీంతో ఏకాగ్రత తగ్గి చదువుపై ప్రభావం పడుతుందని తెలిపారు. 

ఇవి కూడా అలవాటు చేయండి

సమతుల్యమైన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, తగినంత నిద్ర, సరిపడా నీరు తాగడం కూడా పిల్లల మెదడు అభివృద్ధికి అవసరం. పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేయడం ద్వారా వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యాలను మెరుగుపరచవచ్చని డాక్టర్ సత్యప్రియ సూచిస్తున్నారు. 

ఆరోగ్యం గురించిన ఇతర సలహాలు, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget