అన్వేషించండి

Eating Eggs vs Egg Hair Mask : జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేక మాస్క్ వేస్తేనా? నిపుణుల సూచనలివే

Eggs for Hair Growth : గుడ్డు జుట్టు పెరుగుదలకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కానీ దీనిని తింటే ఎక్కువ లాభమా? లేదంటే హెయిర్​కి అప్లై చేస్తే జుట్టు రాలకుండా బాగా పెరుగుతుందా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జుట్టుకు ప్రోటీన్, విటమిన్లు గుడ్లలో లభిస్తాయి.
  • గుడ్లు తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి.
  • ఎగ్ మాస్క్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
  • జుట్టు పెరుగుదలకు గుడ్లు తినడం చాలా ముఖ్యం.

Egg for Hair : గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే చాలామంది రోజూ గుడ్డు తింటారు. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ఉపయోగకరమని చెబుతుంటారు. దీనికోసం డైట్​లో చేర్చుకుంటారు. అలాగే హెయిర్​కి నేరుగా కూడా అప్లై చేస్తారు. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే.. గుడ్డు తింటే జుట్టు బాగా పెరుగుతుందా? లేదా హెయిర్ మాస్క్ వేస్తే ఫలితం ఉంటుందా? మరి ఈ రెండింటిలో ఏది జుట్టు పోషణకు మంచిదో చూసేద్దాం. 

జుట్టు పోషణకై గుడ్డు..

జుట్టు ప్రధానంగా ప్రోటీన్​తో తయారవుతుంది. గుడ్లలోని పోషకాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే బయోటిన్, విటమిన్ A, D, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేస్తాయి. అందుకే జుట్టు పోషణలో గుడ్లు అనేవి కీలకంగా చెప్తారు. మరి వీటిని తింటే మంచిదా? అప్లై చేస్తే జుట్టు పెరుగుతుందా?

గుడ్లు తింటే జుట్టు పెరుగుతుందా?

గుడ్లు తింటే జుట్టు పెరుగుతుందా అనే ప్రశ్నకు సమాధానం అవును. జుట్టు పెరుగుదల అనేది స్కాల్ప్​లోని hair follicles నుంచి ప్రారంభమవుతుంది. అందుకే లోపల నుంచి పోషణ అవసరం. గుడ్డు తిన్నప్పుడు పోషణ అందుతుంది. హెయిర్ ఫాలికల్స్‌కు అవసరమైన ప్రోటీన్ అందుతుంది. కుదుళ్లు బలపడతాయి. దీంతో జుట్టురాలడం తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన హెయిర్ గ్రోత్ ఉంటుంది.

కొన్ని పోషకాహార అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే.. ప్రోటీన్ లోపం ఉన్నవారిలో జుట్టు పలచబడటం, రాలిపోవడం ఎక్కువగా ఉంటుంది. గుడ్లు వంటి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గవచ్చని తేల్చాయి. 

ఎగ్ హెయిర్ మాస్క్ వేసుకుంటే?

చాలామంది గుడ్డు మాస్క్‌ను జుట్టుకు వాడుతారు. అయితే దీనివల్ల కూడా జుట్టు పెరుగుదలకు లాభాలు ఉన్నాయి. కానీ అవి తాత్కాలికమైనవిగా చెప్పవచ్చు. ఎగ్​తో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు సాఫ్ట్‌గా, సిల్కీగా మారుతుంది. ఫ్రిజ్ తగ్గుతుంది. డ్రై హెయిర్‌కు మాయిశ్చర్ అంది నేచురల్ షైన్ వస్తుంది. గుడ్డులోని తెల్లసొన జుట్టు స్మూత్ చేస్తుంది. పచ్చసొన మాయిశ్చర్, విటమిన్స్ ఇస్తుంది. అయితే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. హెయిర్ మాస్క్ జుట్టు పెరగడంలో పెద్దగా రిజల్ట్స్ ఇవ్వదు. 

నిపుణులు ఏమి చెప్తున్నారంటే..

జుట్టు పెరుగుదల కోసం డైటరీ ప్రోటీన్ చాలా కీలకం అని అనేక పోషకాహార పరిశోధనలు సూచిస్తున్నాయి. బయోటిన్ లోపం ఉన్నప్పుడు హెయిర్ లాస్ ఎక్కువగా కనిపిస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి హెయిర్ గ్రోత్ కోసం బయటకు వేసే మాస్క్స్ కంటే, సరైన పోషకాహార తీసుకోవడమే ముఖ్యమైనదని స్కిన్ & హెయిర్ నిపుణులు డాక్టర్ రష్మీ షెట్టి చెప్తున్నారు. జుట్టు నిజంగా పెరగాలంటే గుడ్లు తింటే మంచిదని.. మెరిసేలా, సాఫ్ట్‌గా కావాలంటే మాస్క్ వేసుకోవచ్చని చెప్తునారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget