రోజుకు ఎన్ని గుడ్లు తింటే జుట్టు బాగా పెరుగుతుంది?

Published by: Geddam Vijaya Madhuri

గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది.

అయితే రోజుకు ఎన్ని గుడ్లు తింటే జుట్టు బాగా పెరిగి మంచి కండీషన్​కి వస్తుందో చూసేద్దాం.

రోజుకు 1 లేదా 2 గుడ్లు ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు సరిపోతాయి.

కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డాక్టర్‌ సలహా లేకుండా తినకపోవడమే మంచిది.

ఒకవేళ గుడ్డు తినను అనుకుంటే హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు.

అయితే ఎగ్​ హెయిర్​ మాస్క్ ఎక్కువసేపు ఉంచకండి.

మాస్క్​ తర్వాత హెయిర్ వాష్ చేసేప్పుడు చల్లటి నీటితో కడగండి.

వేడి నీటితో కడిగితే వాసన పెరుగుతుంది.

వారంలో 1సారి హెయిర్ మాస్క్ వేస్తే సరిపోతుంది.

మీ అవసరాన్ని బట్టి గుడ్డు నేరుగా తినొచ్చు. లేదా మాస్క్ వేసుకోవచ్చు.