Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో!
మీరు దెయ్యాలను నమ్ముతారా? అయితే, ఈ వీడియో చూసి.. ఆ బీరు గ్లాసును పడేసింది ఎవరో చెప్పగలరా?
![Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో! Beer Glass Knocked Over By 'Ghost' At UK Bar, CCTV Footage Goes Viral Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/a82aba9cdaa6e128fa883ace5f709c54_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాడుబడిన భవనాలు, శ్మశానాలు, ఇళ్లలోనే కాదు.. అప్పుడప్పుడు దెయ్యాలు బార్‌కు కూడా వెళ్తుంటాయి. మత్తులో ఉండే మందుబాబులను భయపెడితే ఆ కిక్కే వేరబ్బా! అని అనుకుంటాయ్. నమ్మబుద్ధి కావడం లేదా? ఇదిగో ఈ వీడియో చూడండి. దెయ్యాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది.
దెయ్యాలు ఉన్నాయో లేదా అనేది మనం నిర్ధరించలేం. కానీ, కొన్ని ఘటనలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒకప్పుడు దెయ్యాలు వెంటాడుతున్నాయని, భయపెడుతున్నాయంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఏదో చూసి భయపడి ఉంటావని అనేవారు. కానీ, ఇప్పుడు అలా అనడానికి కుదరదు. ఎందుకంటే.. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సీసీటీవీ కెమేరాలు ఉంటున్నాయి. ప్రతి సంఘటన స్పష్టంగా రికార్డవుతుంది. సోషల్ మీడియా దయవల్ల ప్రపంచం మొత్తం పాకేస్తుంది.
యూకేలో ‘బ్లూ హౌస్’ అనే ఓ పాపులర్ పబ్ ఉంది. 167 ఏళ్ల కిందట పురాతన భవనంలో ఉన్న ఈ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయనే వదంతి ఉంది. అక్కడికి వెళ్లే కస్టమర్లు.. తమని ఏదో వెంటాడుతోందనే భావన కలుగుతోందని చెప్పేవారు. అయితే, తాగిన మత్తులో అలా అనిపిస్తోందని చాలామంది పట్టించుకోలేదు. అయితే, తాజాగా లీకైన ఓ సీసీటీవీ కెమేరా ఫూటేజ్‌ను చూసిన తర్వాత కస్టమర్లు ఎదుర్కొంటున్న భయానక అనుభవాలు నిజమే అనే నమ్మకం కలిగింది.
ఓ కస్టమర్ బీరు గ్లాసును పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఆ బీరు గ్లాసు ఎవరి ప్రమేయం లేకుండా కిందపడిపోయింది. దీంతో అందులో ఉన్న బీరు మొత్తం నేలపాలైంది. ఈ షాకింగ్ ఘటన చూసి కస్టమర్‌తోపాటు పబ్ సిబ్బంది కూడా హడలిపోయారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వెంటనే సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించారు. కానీ, అక్కడ ఏమీ కనిపించలేదు. బీరు గ్లాసు దానికదే పడటం మాత్రమే రికార్డైంది.
Also Read: శోభనం రోజే వింత కోరికతో షాకిచ్చిన భర్త.. ఉదయం జంప్!
ఆ పబ్బు ఉద్యోగి డార్లా ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ఎవరో తోసినట్లుగా ఆ గ్లాసు కిందపడింది. ఈ ఘటన జరగడానికి ముందు రోజే ఓ ఆధ్యాత్మికవేత్త పబ్బును పరిశీలించారు. పబ్‌లో ఆత్మలు తిరుగుతున్నాయని చెబితే మేం నమ్మలేకపోయాం. ఆ ఘటన జరిగినప్పుడు పబ్బులో ముగ్గురు.. నలుగురు మాత్రమే ఉన్నారు. ఎవరో పడేశారని ఆరోపించడానికి కూడా లేదు. సీసీటీవీ వీడియో చూసి ఆశ్చర్యపోయాం’’ అని తెలిపింది.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)