First Night Demand: శోభనం రోజే వింత కోరికతో షాకిచ్చిన భర్త.. ఉదయం జంప్!
శోభనం రాత్రి ఆమె భర్త అడకూడనది అదిగాడు. తన వల్ల కాదని చెప్పిన ఆమెకు సైలెంట్‌గా నరకం చూపించాడు.
![First Night Demand: శోభనం రోజే వింత కోరికతో షాకిచ్చిన భర్త.. ఉదయం జంప్! Husband leaves wife after making bizarre demand on First Night First Night Demand: శోభనం రోజే వింత కోరికతో షాకిచ్చిన భర్త.. ఉదయం జంప్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/5a3e6ae1212e6945f5ec3b49d37ff320_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి ఎదురైన చేదు అనుభవం ఇది. తీపి గుర్తుగా మిగిలిపోవల్సిన ఆ శోభనం రోజు రాత్రి.. ఆమె జీవితానికి చేదు గుర్తుగా మిగిలిపోయింది. భర్త అడిగిన వింత కోరిక విని ముందు జోక్ అనుకుంది. అతడు నిజంగానే తన నుంచి అది ఆశిస్తున్నాడని తెలిసి.. షాకైంది. సీన్ అక్కడితో ఆగలేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత అతడు మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
జంషెడ్‌పూర్‌లోని పోట్కా గ్రామానికి చెందిన పల్లవీకి ఇటీవలే జైమాల్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. శోభనం రోజు రాత్రి.. అతడు ఆమెను ఓ వింత కోరిక అడిగాడు. ఆమెను ఐఏఎస్ ఆఫీసర్‌గా చూడాలని ఉందని చెప్పాడు. ఇందుకు రెండేళ్లు గడువు ఇస్తున్నట్లు తెలిపాడు. అతడి కోరిక విని ఆమె.. జోక్ అనుకుంది. ఆ తర్వాత అతడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో సీరియస్‌గానే అడిగాడని తెలుసుకుంది. తర్వాతి రోజు ఉదయం తనకు ఓ ఇంటర్వ్యూ ఉందంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు.
ఆ రోజు బయటకు వెళ్లిన వ్యక్తి కనీసం ఆమెకు ఫోన్ కూడా చేయలేదు. దీంతో ఆమె చాలా సార్లు అతడితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, అతడు ఆమె ఫోన్ కాల్‌ను కట్ చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే కుటుంబం పరువు పోతుందని కొద్ది రోజులు రహస్యంగా ఉంచింది. అయితే, అతడు విడాకుల కోసం దరఖాస్తు చేయడంతో ఆమె మరింత ఆందోళనకు గురైంది. అప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె.. పోలీసులను ఆశ్రయించి తన సమస్యను వెల్లడించింది. తన అత్తమామలు కూడా తనని వేదిస్తున్నారని చెప్పింది. తన తండ్రికి సమస్య కాకూడదనే ఉద్దేశంతో వారు ఎంత హింసించినా అత్తింట్లోనే ఉంటున్నానని తెలిపింది. మరి ఆమెకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)