Baba Vanga Predictions : బాబా వంగా భవిష్యవాణి.. 2026లో జరిగేవి ఇవేనట, ఇండియా పరిస్థితి అదే
Baba Vanga 2026 Predictions : బాబా వంగా 2026 భవిష్యవాణి ఏమి చెప్పింది? ప్రపంచంలో జరిగే మార్పులు ఏంటి? ఇండియా పరిస్థితి ఏంటి? నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూసేద్దాం.

Baba Vanga 2026 Predictions of Indias Future & Global Changes : బాబా వంగా భవిష్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో భయంకరమైన, ఆసక్తికరమైన భవిష్యవాణిని ప్రపంచానికి అందించి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె భవిష్యవాణి భయంకరంగా ఉండటమే కాకుండా.. థ్రిల్లింగ్‌గా కూడా ఉంది. 1996లో మరణించే ముందు ఆమె 5079 సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి లిఖిత పూర్వక పత్రాలు లేవు కానీ.. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.
బాబా వంగా భవిష్యవాణిలలో ప్రకృతి వైపరీత్యాల నుంచి మూడో ప్రపంచ యుద్ధం, మానవ పతనం, సాంకేతిక రంగ బహుముఖాభివృద్ధి కూడా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది బాబా వంగా 2026 సంవత్సరానికి చేసిన భవిష్యవాణిలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. అసలు 2026 సంవత్సరానికి బాబా వంగా ఇచ్చిన భవిష్యవాణి ఏంటో చూసేద్దాం.

2026 భవిష్యవాణి
బాబా వంగా భవిష్యవాణి ప్రకారం.. 2026-28 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య ముగుస్తుందట. చైనా ఆర్థికంగా, సైనికపరంగా కూడా అమెరికాను అధిగమిస్తుందట. విజ్ఞాన శాస్త్రంలో చాలా పురోగతి కనిపిస్తుందని.. అంతేకాకుండా రాబోయే సంవత్సరాల్లో మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని తెలిపారు బాబా వంగా.
ఇండియాలో జరిగే సంఘటనలివే..

బాబా వంగా భారతదేశం గురించి చేసిన భవిష్యవాణిలో ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా ఉండనున్నాయని తెలిపారు. భారతదేశంలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. ఆమె ప్రకారం ఇండియాలోని కొన్ని నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుందని.. దాని ప్రభావం భారతదేశ రాజకీయాలపై కనిపిస్తుందని తెలిపారు.

వంగా భవిష్యవాణిలో నిజమైనవి ఇవే..
బాబా వంగా చెప్పిన భవిష్యవాణిలలో చాలా వరకు నిజమైనవి ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అణు జలాంతర్గామి కుర్స్క్ విపత్తు, ISIS ఉగ్రవాద సంస్థ పెరుగుదల, సిరియా గ్యాస్ దాడి, బ్రెగ్జిట్, 9/11 ఉగ్రవాద దాడి, ప్రిన్సెస్ డయానా మరణం కూడా ఉన్నాయి. బాబా వంగా చెప్పిన ఇవి జరగడం వల్లే చాలామంది ఆమె చెప్పిన భవిష్యవాణిపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే వైజ్ఞానికులు బాబా వంగా భవిష్యవాణిలను పూర్తిగా తోసిపుచ్చారు. ఎందుకంటే దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే వంగా భవిష్యవాణికి సంబంధించి ఎలాంటి లిఖిత పూర్వక రికార్డు లేదు. రెండవది ఏమిటంటే.. ఆమె చేసిన చాలా భవిష్యవాణిలు ఒక నిర్దిష్ట సమయాన్ని దృష్టిలో ఉంచుకుని చేశారు కాబట్టి ఎక్కడో ఒకచోట అవి జరుగుతాయని కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకోకూడదని చెప్తున్నారు.






















