అన్వేషించండి

Doomsday Fish : తమిళనాడులో కనిపించిన 'డూమ్స్ డే ఫిష్'.. ఓర్​ఫిష్​తో సునామీ ముప్పు తప్పదా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే

Facts about Oarfish : తాజాగా తమిళనాడు మత్స్యకారులు డూమ్స్​ డే ఫిష్​ని పట్టుకున్నారు. ఇది బయటకి వచ్చిందంటే మరో సునామి వస్తుందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం?

Oarfish Tsunami Connection :  తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తాజాగా తిరువైకుళం కోస్ట్ దగ్గర్లో ఓ వింతైన చేపను పట్టుకున్నారు. అయితే ఇది చూసేందుకు చాలా పొడుగ్గా, సిల్వర్ కలర్ శరీరాన్ని కలిగి ఉంది. అలాగే దానికి తలపైత ఎరుపు రంగులో పెద్ద క్రెస్ట్ కూడా ఉంది. అయితే దీనిని చూసిన కొందరు ఇది ప్రమాదానికి సంకేతమని చెప్తున్నారు. భూకంపాలు, సునామీలు జరిగే ముందు ఈ చేప ఒడ్డుకు వస్తుందంటూ జోస్యాలు చెప్పేస్తున్నారు. అసలు ఈ చేప గురించిన వివరాలు ఏంటి? దీనికి సునామికి ఉన్న సంబంధం ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఓర్ ఫిష్

సముద్రంలో ఉండే ఈ వింత జీవిని ఓర్ ఫిష్ (Doomsday Fish aka Oarfish) అంటారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకని కలిగి ఉన్న ఫిష్ ఇది. దాదాపు 11 మీటర్లు (36 అడుగులు) పెరుగుతుంది. పొడవైన పాములాగా కనిపించే ఓర్​ఫిష్ సముద్రంలో లోతైన ప్రాంతంలో జీవిస్తుంది. 200 నుంచి 1000 అడుగుల కంటే ఓర్​ఫిష్​లు లోపల జీవిస్తాయి. ఈ సముద్ర జీవులు హాని చేసే రకం కాదు. పైగా చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి చనిపోయినప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడే ఎక్కువగా కనిపిస్తాయి. 

సునామీతో సంబంధం ఏమిటి?

జపాన్​కు చెందిన కొన్ని సంస్కృతులలో ఓర్​ ఫిష్​ గురించి ప్రస్తావన ఉంది. సముద్ర దేవుడు వీటి ద్వారా సందేశం ఇచ్చినట్లు వారు భావిస్తారు. సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు ఇవి తీరానికి వస్తాయంటారు. ఈ నేపథ్యంలోనే నీటి అడుగున జరిగే భూకంపాలు, సునామీలను ఈ జీవులు అంచనా వేస్తాయని వారు నమ్ముతారు. 

2011లో ఏమైందంటే.. 

జపాన్​లో 2011లో సునామీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో నెలలోపు 20 ఓర్​ఫిష్​లు కనిపించాయని.. ఆ తర్వాత జపాన్​లో సునామీ, భూకంపం వచ్చినట్లు చెప్తారు. అప్పటి నుంచి ఈ ఓర్​ఫిష్​లను డూమ్స్​ డే ఫిష్​గా పిలుస్తున్నారు.  

మరో సునామీ తప్పదా?

తాజాగా తమిళనాడులో ఓ ఓర్​ఫిష్​ దొరికింది. కొద్ది రోజుల ముందే తస్మానియా వెస్ట్ కోస్ట్​లో చనిపోయిన ఓర్​ఫిష్ కనిపించింది. ఈ రెండూ దాదాపు కొద్ది రోజుల్లోనే కనిపించడంతో సునామీ, భూకంపం వస్తాయా అనే భయం కొందరిలో పెరిగింది.  

ఇటీవలె లెవియాథన్ ప్రస్తావన గురించిన వార్తలు చాలా వైరల్ అయ్యాయి. వాటిని ప్రపంచ అంతానికి చిహ్నంగా భావించి.. వాటికి సంబంధించిన పలు స్టోరీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఓర్​ఫిష్​ గురించి కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో సముద్రంలో ఏదో జరుగుతుందని.. అందుకే ఇవన్నీ వినిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు. 

శాస్త్రీయ ఆధారాలు 

శాస్త్రవేత్తలు మాత్రం వీటిని తోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే వారి నమ్మకానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అవి బయటకు రావడానికి అనారోగ్య కారణాలు ఉండొచ్చని.. సముద్రంలో వాతావరణ మార్పులు కూడా వాటిని బయటకు వచ్చేలా చేస్తాయని.. అంతేకానీ వీటికి సునామీకి, ఎలాంటి సంబంధం లేవని చెప్తున్నారు. కాబట్టి వదంతులు నమ్మకపోవడమే మంచిదని చెప్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget