అన్వేషించండి

Sleep Tips : నిద్రవేళ పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు.. సహజంగా నిద్ర నాణ్యతను పెంచే 5 టిప్స్

Ayurveda Tips for Better Sleep : రాత్రుళ్లు నిద్ర రావట్లేదా? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు మీకు నిద్రను రప్పించడంతో పాటు నిద్ర నాణ్యతను పెంచుతాయి అంటున్నారు నిపుణులు.

Tips for Better Sleep : స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించడం, ఒత్తిడి, లైఫ్​స్టైల్​లో మార్పుల కారణంగా పెద్దల నుంచి టీనేజర్స్​ వరకు చాలామంది నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో మంచి నిద్ర అనేది సూపర్​ లగ్జరీగా మారింది. అయితే ఆయుర్వేదంలోని కొన్ని చిట్కాలు మెరుగైన నిద్రను అందించడంలో హెల్ప్ చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రశాంతమైన నిద్ర కోసం శరీరం, మనస్సును సహజంగా సిద్ధం చేయడంలో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారు. ఇవి నిద్ర నాణ్యతను పెంచడమే కాకుండా.. వాత, పిత్త, కఫ దోషాలను దూరం చేస్తాయంటున్నారు. మరి మెరుగైన నిద్ర కోసం.. ఉదయాన్నే రిఫ్రెష్‌గా మేల్కొనడానికి రొటీన్​లో చేర్చుకోగల ఆయుర్వేద చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

అభ్యంగ

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

అభ్యంగ అనేది నువ్వుల నూనె లేదా బాదం నూనెను ఉపయోగించే చేసుకునే మసాజ్. ఇది నాడీ వ్యవస్థను శాంతింపజేయడానికి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న నూనెను తీసుకుని గోరువెచ్చగా చేసి.. మీ పాదాలు, తలపై, మెడ, భుజాలపై మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఆలోచనలు తగ్గించి.. విశ్రాంతిని అందిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

గోరువెచ్చగా వాటిని తాగండి

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

జాజికాయ, అశ్వగంధ, పసుపు లేదా చమోలి వంటి మూలికలతో చేసిన గోరువెచ్చని హెర్బల్ టీలు లేదా గోరువెచ్చని పాలు తాగితే మంచిది. ఇది జీర్ణక్రియను శాంతపరచడమే కాకుండా.. మీ నరాలను శాంతపరచడానికి, మెలటోనిన్ ఉత్పత్తిని సహజంగా ప్రోత్సహించడానికి హెల్ప్ చేస్తుంది. పాలు ఇష్టం లేని వారికి హెర్బల్ టీలు బెస్ట్. నిద్రపోయే ముందు కెఫిన్ లేదా తీపి కలిగిన డ్రింక్స్ తీసుకోకూడదు. 

నాస్య

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

నాస్య అనేది ఎక్కువమందికి తెలియదు. ఆయుర్వేదంలోని ఈ అలవాటు గురించి చాలా తక్కువమందికి తెలుస్తుంది. నాస్యలో భాగంగా నిద్రపోయే ముందు తైలం లేదా నెయ్యి వంటి దానిని కొన్ని చుక్కలు ముక్కు రంధ్రాలలో వేసుకోవాలి. నాస్య నాసికా మార్గాలను సజావుగా చేసి.. మానసిక ఆందోళనను తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. ఆలోచనలను శాంతపరచడానికి సహాయపడుతుంది. సైనస్లు, మైగ్రేన్లు లేదా శ్వాస సమస్యలతో నిద్ర సమస్యలు ఎదుర్కొనేవారికి ఇది మంచిది. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం.. ముక్కు మెదడుకు మార్గం. ఈ మార్గాన్ని పోషించి, నాడీ వ్యవస్థను స్థిరీకరించడానికి ఈ ప్రక్రియ హెల్ప్ చేస్తుందని చెప్తారు.

శిరోధార

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

శిరోధార అనేది నుదుటిపై చల్లని తడి గుడ్డ లేదా ఐస్ ప్యాక్ పెట్టి చేసే పద్ధతి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సా కేంద్రాలలో చేర్చుతారు. అయితే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చల్లని లేదా తడి గుడ్డను మీ నుదిటిపై ఉంచి రిలాక్స్ అవ్వాలి. నిద్రపోయే ముందు 5-10 నిమిషాల పాటు డీప్ బ్రీత్ లేదా ధ్యానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆలోచనలను తగ్గి.. ఆందోళన కంట్రోల్ అవుతుంది. వాత దోషాల తగ్గుతాయి. ఈ టెక్నిక్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

డిజిటల్ డిటాక్స్

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

ఆయుర్వేదంలో.. నిద్రపోయే ముందు స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటే నిద్రకు అంతరాయం కలిగిస్తుందని చెప్తారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, LED లైటింగ్ కూడా మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించే బ్లా రేస్ విడుదల చేస్తాయి. ఇవి పిత్త దోషాన్ని అధికం చేస్తాయి. మిమ్మల్ని చురుకుగా, విశ్రాంతి లేకుండా, ఆందోళనతో ఉంచుతాయి. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం నిద్రపోయే కనీసం గంట ముందు పూర్తిగా డిజిటల్ డిటాక్స్ ఫాలో అవ్వాలని అంటున్నారు. గది చీకటిగా ఉంటే.. బెటర్ అని సూచిస్తున్నారు. 

ఈ 5 ఆయుర్వేద చిట్కాలు నిద్రను ప్రేరేపించడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని చెప్తున్నారు. మరి నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు హాయిగా వీటిని ఫాలో అయిపోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget