Cardamom at Night : నిద్రపోయే ముందు యాలకులు తిని పడుకుంటే ఎంత మంచిదో తెలుసా? ఆ సమస్యలు దూరం
Cardamom before Bed Benefits : రాత్రి పడుకునే ముందు యాలకులను మీరు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ సమస్యలను దూరం చేసుకోవడానికి దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

Cardamom Health Benefits : ప్రతి ఇంట్లో యాలకులు కచ్చితంగా ఉంటాయి. ఈ మసాలా దినుసును చాలా వంటల్లో, స్వీట్స్‌లో కూడా వాడుతారు. అయితే మీకు తెలుసా? రోజూ రాత్రి పడుకునేముందు యాలకులు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఏంటి.. అనుకుంటున్నారా? అవును. రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే చాలా మంచిదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, జీర్ణ ఎంజైమ్‌లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రాత్రి శరీరాన్ని రీసెట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారు. రాత్రుళ్లు యాలకులు తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియకు
యాలకుల్లోని జీర్ణ ఎంజైమ్‌లు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేయడానికి హెల్ప్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు దూరమవుతాయి. ఎక్కువ భోజనం తీసుకున్నప్పుడు, ఆలస్యంగా తిన్నప్పుడు తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటుంది. గ్యాస్ చేరడాన్ని తగ్గిస్తుంది. దీనిలోని యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు కడుపులోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే పోషకాల శోషణ మెరుగవుతుంది.
ఫ్రెష్ బ్రీత్
నోటి నుంచి చెడు బ్రీత్ వస్తుందా? అయితే ఇది మీకు చాలా మంచిది. నిద్ర సమయంలో నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల వచ్చే సమస్యను ఇది తగ్గిస్తుంది. ఇలాచిలోని సినీయోల్ వంటి ముఖ్యమైన ఆయిల్స్ నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడతాయి. మీ శ్వాసను సువాసనతో నింపడమే కాకుండా.. బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. చిగుళ్ల వాపు తగ్గడంతో పాటు.. పరిశుభ్రతను ఇస్తుంది. నోటిలోని తేమను నిర్వహించడానికి, pHని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
మెరుగైన నిద్ర
మీరు నిద్రలేమితో ఇబ్బంది పడేవారు అయితే మీరు రాత్రుళ్లు యాలకులు తింటే మంచిది. ఎందుకంటే దీనిలో మెదడును శాంతపరిచే ఉపశమన లక్షణాలతో పాటు.. ఆందోళనను తగ్గిస్తాయి. ప్రశాంతమైన నిద్రను ప్రేరేపిస్తాయి. మంచి విశ్రాంతిని అందిస్తుంది. దీనిలోని మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి. మంచి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. ప్రశాంతమైన నిద్రకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
డీటాక్స్ చేసుకోవడానికి
యాలకులు మూత్రవిసర్జన లక్షణాలు కలిగి ఉంటాయి. రాత్రి తినడం వల్ల మూత్రం ద్వారా టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల చర్మం మెరుగవుతుంది. అంతేకాకుండా శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో యాలకులను 'త్రిదోషిక' సుగంధ ద్రవ్యంగా చెప్తారు. అంటే ఇది మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలు దూరం
ఆయుర్వేదంలో శ్వాసకోశ పనితీరుకు మద్దతు ఇవ్వడానికి యాలకులను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది సహజమైన ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. నాసికా మార్గాలను శుభ్రపరుస్తుంది. వాపు కలిగిన వాయుమార్గాలను శాంతపరుస్తాయి. దగ్గును తగ్గిస్తుంది. సుగంధ ద్రవ్యాల యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తేలికపాటి ఆస్తమా, బ్రోన్కైటిస్, సీజనల్ అలెర్జీలను దూరం చేస్తాయి.
షుగర్ కంట్రోల్
యాలకుల ప్రభావం రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్-రిచ్ సమ్మేళనాలు రాత్రిపూట రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధిస్తాయి. స్లీప్ సైకిల్ బాగుంటే శరీకరం గ్లూకోజ్ నియంత్రణకు మద్దతు ఇస్తుంది.
కాబట్టి మీరు రాత్రి పడుకునేముందు ఒకటి లేదా రెండు యాలకులు తీసుకోండి. అయితే మీ రొటీన్లో ఏదైనా తీసుకునే ముందు వైద్యుల సహాయం తీసుకుంటే మంచిది. ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి దీనిని డైట్లో చేర్చుకోవడం మంచిదే అయినా.. మీ శరీరానికి అది సూట్ అవుతుందో లేదో వైద్యులు సలహా ఇస్తారు.






















