Malaria Prevention Tips : వర్షాకాలంలో మలేరియా వ్యాప్తి.. తగ్గించే ఇంటి చిట్కాలు, రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు
Malaria : వర్షాకాలంలో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరి దీనిని ఎలా అరికట్టాలో.. తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ఫాలో అవ్వాల్సిన ఇంటి చిట్కాలు, చికిత్స వంటి వాటి గురించి తెలుసుకుందాం.

Malaria Home Remedies and Precaution Tips : మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించో ఓ సీరియస్ డిసీజ్. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయాన్నే గుర్తిస్తూ.. దోమల వ్యాప్తిపై అవగాహన కల్పిస్తూ ప్రపంచ దోమల దినోత్సవం చేస్తున్నారు. ఈ స్పెషల్ డేని మలేరియాను అరికట్టడానికే తెరపైకి తెచ్చారు. ఈ ప్రాణాంతక సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఇంటి చిట్కాలు ఏవిధంగా హెల్ప్ చేస్తాయో చూసేద్దాం.
మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుందని 1897లో కనుగొన్నారు. అప్పటికి మలేరియా ద్వారా ఎందరో ప్రాణాలు విడిచారు. కానీ బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ దానికి బ్రేక్స్ వేశారు. దోమల ద్వారా మలేరియా వస్తుందని గుర్తించి వాటిని అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. దీనికి గానూ 1902లో ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు. దీనిని గుర్తు చేసుకుంటూ.. దోమల అరికట్టడం అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం World Mosquito Dayని ఆగస్టు 20వ తేదీన నిర్వహిస్తున్నారు.
మలేరియా
ప్రపంచ దోమల దినోత్సవం రోజు.. మలేరియా వంటి వ్యాధుల గురించి తెలుసుకోవాలి. అప్పుడే వాటిని ఎలా అరికట్టాలో తెలుస్తుంది. మలేరియా Plasmodium parasite వల్ల వస్తుంది. అనోఫెలిస్ అనే ఆడదోమ కాటు వేయడం వల్ల ఇది వ్యాపిస్తుంది. మలేరియా వస్తే జ్వరం, వణుకు, చెమటలు, తలనొప్పి, బాడీ పెయిన్స్, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మలేరియా వస్తే ఎక్కువగా నీటిని తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్లు తాగితే హెడ్రైటెడ్గా ఉంటారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. స్పైసీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్కి దూరంగా ఉండాలి. లేదంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇంటి చిట్కాలు, నివారణ చర్యలు ఫాలో అవుతూ.. వైద్యులు ఇచ్చే యాంటీ మలేరియల్ ట్యాబ్లెట్స్ కచ్చితంగా వాడాలి.
మలేరియాను తగ్గించే ఇంటి చిట్కాలు
తులసి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మలేరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ఆకులు రోజూ నమలడం లేదా తులసి టీ తాగడం చేయాలి. అల్లం టీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మలేరియా వల్ల వచ్చే వాంతులు, జ్వరం తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దాల్చిన చెక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డీకాషన్ తాగితే శరీరం డీటాక్స్ అవుతుంది.
లెమన్ వాటర్ శరీరానికి హైడ్రేషన్ అందించి.. జ్వరం, డీహైడ్రేషన్ తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అలోవెరా కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మలేరియా రోగులలో బలహీనతను దూరం చేస్తుంది. మిరియాల పొడిలో తేనె కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు దగ్గు, వణుకు తగ్గుతుంది. ఈ ఇంటిచిట్కాలు మలేరియాను నుంచి కోలుకునేందుకు సహాయం చేస్తాయి.
మలేరియా నివారణ చర్యలు
మలేరియా దోమలు కుట్టకుండా దోమల తెరలు వాడాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా మస్కిటో క్రీములు వాడాలి. పొడుగు, లేత రంగు దుస్తులు ధరించాలి. కిటికీలు, తలుపుల దగ్గర మస్కిటో మ్యాట్స్ పెడితే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఇంటి చుట్టూ పక్కల ఉండే డ్రైనేజ్, గార్డెన్ ట్యాంకులు శుభ్రం చేస్తూ ఉంటే దోమల వ్యాప్తి తగ్గుతుంది.






















