అన్వేషించండి

Chicken : చికెన్ తినేవారికి బ్యాడ్ న్యూస్.. ఆ సమస్యలుంటే తినకపోవడమే మంచిదట, రీజన్స్ ఇవే

Chicken Lovers Beware : చికెన్​ను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. 

Harmful Effects of Chicken : పిల్లల నుంచి పెద్దలవరకు చాలామంది చికెన్​ను ఇష్టంగా తింటారు. దానిలోని పోషకాలు, ప్రోటీన్ కోసం కూడా తమ డైట్​లో దీనిని చేర్చుకుంటారు. నోటికి రుచిగా ఉండే చికెన్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే దీనిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవారు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆరోగ్య సమస్యలు ఏంటి? దానిని తినడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కొలెస్ట్రాల్ 

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు కూడా చికెన్​కు, ముఖ్యంగా చికెన్ స్కిన్​కు దూరంగా ఉండాలని చెప్తున్నారు. చికెన్ స్కిన్​లోని ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ పెంచి గుండె సమస్యలను పెంచుతాయట. కుటుంబంలో హార్ట్ సమస్యలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉంటే మంచిది.

కిడ్నీ సమస్యలు

చికెన్​లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తినడం వల్ల వాటిపై మరింత ఒత్తిడి పడుతుందట. క్రానిక్ కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనికి దూరంగా ఉండడం లేదా లిమిటెడ్​గా తీసుకోవడమే మంచిదని చెప్తున్నారు. 

యూరిక్ యాసిడ్..

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే అది కీళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీరు ఇప్పటికే ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా చికెన్​కు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే చికెన్​లో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచుతాయి. ముఖ్యంగా లివర్, చికెన్ స్కిన్ తింటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఆర్థ్రరైటిస్, కీళ్ల సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలంటున్నారు. 

చర్మ సమస్యలు

చికెన్ తినడం వల్ల స్కిన్ సెన్సిటివిటీ ఉండేవారికి పింపుల్స్ వస్తాయి. తామర వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా బాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఇవి రెట్టింపు అయ్యే అవకాశముంది. ఆర్గానికి చికెన్ ఇబ్బంది కలిగించదని చెప్తున్నారు. 

అలెర్జీలు 

చికెన్​తో మీకు అలెర్జీలు, సెన్సిటివిటీ ఉంటే దానిని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. లేదంటే ర్యాష్, జీర్ణ సమస్యలు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముందని చెప్తున్నారు. 

ఇవే కాకుండా మహిళలు ఎవరైతే హార్మోనల్ సమస్యలు, PCOS సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మానేస్తే లేదా తగ్గించి తీసుకుంటే మంచిది. లేదంటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు రావొచ్చు. మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వైద్యుల సహాయం, సలహాలు తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget