షాకింగ్, వాయు కాలుష్యం వల్ల మధుమేహం వచ్చే అవకాశం, జాగ్రత్తలు తీసుకోక తప్పదు
వాయుకాలుష్యానికి మధుమేహానికి సంబంధం ఉన్నట్టు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
డయాబెటిస్ ఎందుకు వస్తుంది? దీనికి ఒక కారణం చెప్పడం చాలా కష్టం. వైద్యులు ఇదే అసలైన కారణం అని చెప్పడానికీ లేదు. చెడు ఆహారపు అలవాట్లు,కుటుంబ చరిత్ర వంటివే ఎక్కువ మందికి తెలుసు. కానీ వాయు కాలుష్యం కూడా ఒక కారణమేనని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. గాలి కాలుష్య కారకాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అధికం. ముఖ్యంగా పొగాకు, సిగరెట్ల నుంచి వచ్చే ప్రమాదకర వాయువులు, అలాగే వాహనాల నుంచి విడుదలయ్యే వివిధ రకాల రసాయనాలు కూడా గాలిలోనే కలుస్తాయి. ఈ గాలిని పీల్చడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా పెరుగుతుంది.
వీటితో పాటూ...
గాలి కాలుష్యం వల్ల చాలా రకాల ఆరోగ్యసమస్యలు వస్తాయి. క్యాన్సర్, కాలేయ సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారడం, పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలు వంటివి ఉత్పన్నమవుతాయి. అలాగే నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యర్థ పదార్థాలను, టైర్లను కాల్చడం వంటి వాటివల్ల గాలి కాలుష్యం మరింత పెరుగుతుంది. అలాగే పంటలపై చల్లే పురుగుమందులు, రసాయన ఎరువులు వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతుంది. ఇవన్నీ ఆరోగ్యాన్ని నాశనం చేసేవే.
ప్రధాన కారణం...
మొన్నటి గాలి కాలుష్యానికీ, మధుమేహానికీ ఎలాంటి సంబంధం లేదని అనుకున్నారు. ఇప్పటికీ చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదు కానీ ఎవరైతే అధిక సమయం గాలి కాలుష్యానికి గురవుతారో వారిలో మధ్యమేహం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఆ కాలుష్యం వల్ల ఇన్సులిన్ ఆధారిత గ్లూకోజ్ తీసుకోవడం అనేది శరీరంలో తగ్గిపోతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. అలాగే సబ్కటానియస్ కొవ్వు పేరుకుపోవడాన్ని పెంచుతుంది. వాయుకాలుష్యంతో మధుమేహాహానికి ఉన్న సంబంధంపై అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్న ప్రకారం కార్లు, ట్రక్కుల నుంచి వచ్చే కాలుష్యం అధిక సమస్య.
ప్రపంచంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే డయాబెటిస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కాలుష్యం తగ్గకపోతే మరింత మంది డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. గాలి కాలుష్యం బారిన అధికంగా పడే వారు ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కొవ్వున్న చేపలను ఎంచుకుంటే ఆ కొవ్వులోనే ఒమెగగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. సాల్మన్, మాకెరెల్, సార్టినస్, ట్రౌట్ వంటి చేపల్లో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు దొరుకుతాయి.
Also read: ఈ చిత్రంలో అయిదు పక్షులు దాక్కున్నాయి, ఎక్కడున్నాయో వెతికి పట్టుకుంటే మీ చూపు భేష్
Also read: అయిదు రోజులు ట్రిప్‌కెళ్లాడు, వచ్చాక చూస్తే ఒకేసారి మంకీపాక్స్, కోవిడ్, హెచ్ఐవీ పాజిటివ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.