Viral: అయిదు రోజులు ట్రిప్‌కెళ్లాడు, వచ్చాక చూస్తే ఒకేసారి మంకీపాక్స్, కోవిడ్, హెచ్ఐవీ పాజిటివ్
ఓ వ్యక్తి సరదాగా అయిదు రోజుల ట్రిప్పుకెళ్లాడు, అదే అతని జీవితాన్ని తలకిందుకు చేసింది.
కోవిడ్ సోకితేనే భయంతో విలవిలలాడిపోతాం. అలాంటిది మూడు భయంకర రోగాలు సోకితే... ఊహించుకుంటేనే వణుకుపుడుతుంది. కానీ ఓ వ్యక్తికి ఆ మూడు కేవలం అయిదు రోజుల ట్రిప్పులోనే వచ్చేశాయి. ఆ విహారయాత్రలో ఆయన తనను తాను కంట్రోల్ చేసుకోకపోవడం, ఎక్కువమందితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల అతనికి మంకీపాక్స్, హెచ్ఐవీ సోకాయి. ఇక వీటి ముందు కోవిడ్ సోకినా కూడా అతను పట్టించుకనే పరిస్థితిలో లేడు. ఆ రెండూ సోకాయని తెలియగానే బాధ, పశ్చాత్తాపంతో కుంగిపోయాడు ఆ యువకుడు. అతని వయసు కేవలం 36. మిగతా జీవితమంతా ఎయిడ్స్‌తో బతకాలన్న ఆలోచనే అతడిని కాల్చేస్తుంది.
అసలేం జరిగింది?
ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి (పేరు గోప్యంగా ఉంచారు) స్పెయిన్ వెళ్లారు. అక్కడ అయిదు రోజుల పాటు విహారయాత్రకు వెళ్లాడు. ఆ తరువాత తిరగి ఇటలీకి వచ్చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తొమ్మిదో రోజు నుంచి ఆయనలో ఒక్కో లక్షణం బయటపడడం మొదలైంది. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురించిన కథనం ప్రకారం అతనికి మొదట జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట వచ్చాయి. మూడు రోజుల పాటూ వీటితోనే బాధపడ్డాడు. టెస్టు చేయించుకుంటే కోవిడ్ 19 అని తేలింది. రెండు రోజులు పోయాక ఆ వ్యక్తి ఎడమ చేతిపౌ ఎర్రటి దద్దుర్లు రావడం మొదలు పెట్టాయి. అవి అలా పాకుతూ ముఖం, ఛాతీ, నడుము కింది భాగంలో వచ్చాయి. అవి చాలా బాధించడం మొదలుపెట్టాయి. వెంటనే అతడిని వేరే ఆసుపత్రికి తరలించి అక్కడ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష్లల్లో మంకీపాక్స్, హెచ్ఐవీ రెండూ సోకినట్టు గుర్తించారు. విషయం తెలిసి అతనితో పాటూ కుటుంబ సభ్యులంతా కుంగిపోయారు. ఆ ట్రిప్పుకు వెళ్లకపోయుంటే బావుండేదని, ఇంత పెద్ద శిక్ష పడేది కాదని బాధపడ్డారు.
వైద్యులు అతనికి కోవిడ్, మంకీ పాక్స్ కు చికిత్స అందించి అవి తగ్గాక డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇక హెచ్ ఐవీకి జీవితాంతం మందులు వాడాల్సిందే. చెడు లైంగిక అలవాట్లు 36 ఏళ్ల వ్యక్తి జీవితాన్ని నాశనం చేశాయి. అందుకే లైంగిక వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒకరు కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రపంచంలో ఇలా మూడు అంటురోగాలు ఒకేసారి సోకిన వ్యక్తి మాత్రం ఇతనే. ప్రస్తుతం తన ఇంట్లో చేసిన తప్పులను తలచుకుని బాధపడుతున్నాడు. ఎయిడ్స్ ఉందని తెలిసి చాలా మంది అతనిని కలవడం కూడా తగ్గించారు.
కొన్ని క్షణాల సుఖం కోసం చేసే తప్పులు జీవితానికి సరిపడా శిక్షలు వేస్తాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం లేనప్పుడు మీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా వృధానే.
Also read: ‘లైగర్’ అంటే ఇదే, ఈ అరుదైన జాతి ప్రత్యేకలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి