Liger: ‘లైగర్’ అంటే ఇదే, ఈ అరుదైన జాతి ప్రత్యేకలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
విజయ్ దేవరకొండ సినిమా లైగర్ నేడు విడుదల కాబోతోంది. ఆ సినిమాకు పెట్టిన పేరు ఈ జంతువుదే.
లైగర్... ఇప్పుడు ఇదొక సినిమా. కానీ ఆ సినిమాకు పెట్టింది ఓ అడవి జంతువు పేరు. కానీ ఇది అడవుల్లో కనిపించదు, అక్కడ బతకలేదు. లైగర్ సినిమా ట్యాగ్ లైన్ ‘సాలా క్రాస్ బ్రీడ్’. లైగర్ జంతువు కూడా క్రాస్ బ్రీడ్ వల్లే పుట్టింది. అందుకే ఆ సినిమాకు లైగర్ అనే టైటిల్ ఎంచుకున్నారు. ప్రపంచంలో పులి, సింహం, నక్క, తోడేలు... ఇలాంటి జాతి అడవి జంతువులు సహజంగానే ఉన్నాయి. కానీ లైగర్ అనే జాతి మాత్రం లేదు. జంతు శాస్త్రవేత్తలు సృష్టించిన క్రాస్‌బ్రీడ్ జీవి ఇది. అందుకే దీని గురించి తెలియదు, ఎక్కువ దేశాల్లో ఇది కనిపించదు. మనదేశంలో అయితే ఒక్కటీ లేదు.
ఎలా పుట్టింది?
ఇదొక హైబ్రిడ్ జంతువు. మగ పులి - ఆడ సింహం, లేదా ఆడ పులి - మగ సింహం మధ్య క్రాస్ బ్రీడ్ వల్ల లైగర్ పుట్టింది. అందుకే టైగర్, లయన్ పేర్లను కలిపేలా ‘లైగర్’ అని పేరు పెట్టారు. జూ పార్కులలో ఉన్న పులి, సింహాల మధ్య బంధంతో ఈ లైగర్ పుట్టింది. అందుకే ఇవి అడవిలో కనిపించవు. బతకలేవు. కేవలం సఫారీ పార్కులలో, జూలలో మాత్రమే నివసిస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. ఇవి తమ తల్లిదండ్రులపై సింహం, పులి కన్నా పెద్దవిగా పెరుగుతాయి. అందుకే వీటిని చూడటానికి సఫారీ పార్కులకు పర్యాటకులు అధికంగా వస్తారు.
మొదటి లైగర్...
ప్రపంచంలో మొట్టమొదటి లైగర్ 1897 మే 11న పుట్టిందని చెబుతారు. కానీ దీని మూలాలు ఇండియాలో ఉన్నట్టు గుర్తించారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. 18వ శతాబ్ధంలో ప్రసిద్ధ జర్మన్ జంతు వ్యాపారి కార్ల్ హెగెన్ బెక్ తన జూలో రెండు లైగర్లను పెంచినట్టు చెబుతారు. ఈయన ఇలాంటి హైబ్రిడ్ జంతువులను సృష్టించేందుకు ప్రయత్నించే వాడు. అప్పట్లో జూలకు జంతువులను సప్లయ్ చేసేవాడు. మొదటి లైగర్ ఎక్కడు పుట్టిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తరువాత ఆఫ్రికాలో కూడ వీటిని క్రాస్ బ్రీడ్‌తో జన్మించేలా చేశారు.
వీటిని చూడాలంటే విదేశాలకు వెళ్లాలి. ఇంతవరకు ఒక లైగర్ కూడా మనదేశంలో ఉన్నట్టు గుర్తించలేదు. అనుకోకుండా కూడా ఏ జూ పార్కులోనూ సింహం- పులి మధ్య శారీరక సంబంధం ఏర్పడలేదు. అలా ఏర్పడి ఉంటే లైగర్లు జన్మించి ఉండేవేమో.
అతి పెద్దగా...
ప్రపంచంలోనే అతి పెద్ద పులి జాతి లైగరే. ఇవి ఒక్కోటి 500 కిలోల బరువు పెరుగుతాయి. బలమైన కండరాలతో ఉంటుంది. వెనుక కాళ్లపై నిల్చుందంటే 12 అడుగుల ఎత్తు వస్తుంది. సాధారణంగా నిల్చుంటే నాలుగున్నర అడుగులు పెరుగుతుంది. ఇవి మగ సింహాల కంటే, పులుల కంటే పొడవు పెరుగుతాయి. గంటకు యాభై మైళ్ల వేగంతో పరిగెడతాయి. అంటే గంటలో 80 కిలోమీటర్లు చేరుకుంటాయన్న మాట. వీటికి పులి లక్షణాలు అధికంగా వస్తాయి. పులులు నీటిని ఇష్టపడతాయి. సింహాలు చెరువుల దగ్గరకి వచ్చేందుకు ఇష్టపడవు. లైగర్లు పులుల్లాగే చెరువుల చుట్టూ తిరుగుతాయి. వాటికి నీరంటే చాలా ఇష్టం.
ప్రపంచం మొత్తమ్మీద ఇవి ఓ వంద వరకు ఉంటాయని అంచనా. వాటిలో ఓ 30 లైగర్లు అమెరికాలోనే ఉన్నాయి. మగవాటిని లైగర్ అని, ఆడవాటిని లైగ్రెస్ అని పిలుస్తారు. అన్నట్టు ఇవి తమ జాతి లైగర్లతోనే జత కడతాయి. పులి, సింహాలతో జోలికి పోవు. వీటి సంఖ్యని పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు జంతు శాస్త్రవేత్తలు.
View this post on Instagram
Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి
Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు