ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి
ఆహారం టేస్టీగా ఉండాలని కారం, ఉప్పులు దట్టించి తింటున్నారా? అయితే మీ ఆయుష్షు తగ్గడం ఖాయం.
ఎక్కువకాలం జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు కానీ ఆధునిక కాలంలో ఆయుర్ధాయం తగ్గిపోతోంది. దానికి కారణం జీవనశైలి, తినే తిండే. జంక్ ఫుడ్ పెరిగిపోవడం, నిద్ర లేమి, ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం వంటివి ప్రధానంగా ఆయుర్ధాయాన్ని తగ్గిస్తాయి. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగడం, మందకొడి జీర్ణక్రియ వంటివి మరింతగా దెబ్బతీస్తాయి. అందుకే చిన్న ఆహారమార్పు చేయడం ద్వారా ఆయుర్ధాయాన్ని పెంచుకోవచ్చు. మీరు దీనికోసం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. మీరు తినే తిండిలో ఉప్పును తగ్గించుకోవాలి. అలాగే సోడియం క్లోరైడ్ అధికంగా ఉండే ఉప్పు కన్నా పొటాషియం క్లోరైడ్ అధికంగా ఉండే ఉప్పుని ప్రయత్నించడం ఉత్తమం.
ఇటీవల 31,949 మందిపై 21 ట్రయల్స్‌తో ఒక పరిశోధనను నిర్వహించారు. ఆ పరిశోధనలో ఉప్పును ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది. అలాగే ఉప్పుకు బదులు ప్రత్నామ్నాయాలు ఎంచుకోవడం వల్ల కూడా ఆరోగ్యంపై చాలా ప్రభావం పడినట్టు కనుగొన్నారు. ఉప్పులోని సోడియం క్లోరైడ్ పది శాతం తగ్గినా సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటులో తగ్గుదల కనిపించింది ఆ పరిశోధనలో. అంతేకాదు సోడియం ఎంతో కొంత తగ్గడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ అందిస్తుందని కూడా తేలింది. ఉప్పును తగ్గిస్తే చాలు దీర్ఘాయువు దక్కుతుంది.
ఏం చేయాలి?
ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం తగ్గించాలి. దానికి బదులు పొటాషియం ఉన్న ఉప్పును తీసుకోవాలి. ఉప్పుకు ప్రత్నామ్నాయాలను వెతికి వాటితో ఇంట్లో వాడే ఉప్పును రీప్లేస్ చేయాలి.
రక్తపోటు రోగులకు ఉత్తమ ఉప్పు ప్రత్యామ్నాయాలు
నల్ల ఉప్పు
కల్లు ఉప్పు
హిమాలయన్ పింక్ సాల్ట్
వెల్లుల్లి
నిమ్మకాయ పొట్టు
బాల్సమిక్ వెనిగర్
నల్ల మిరియాలు
టేబుల్ సాల్ట్‌కు బదులుగా ఈ ఉప్పు పత్నామ్నాయాలను ఉపయోగించవచ్చు. వీటిని కూరగాయలు, మాంసం, పాస్తా వేటిలోనైనా కలిపి వండుకోవచ్చు. రుచి కోసమ చూసుకోకుండా ఉప్పు వాడకం ఎంత తగ్గిస్తే అంతగా మీకు దీర్ఘాయువు దక్కుతుంది.
Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు
Also read: అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.