News
News
X

Bay Leaf : బిర్యానీ ఆకు రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుందండోయ్

సాధారణంగా బిర్యానీ ఆకు రుచి, మంచి వాసన కోసం వంటల్లో వేసుకుంటారు. తినేటప్పుడు మాత్రం తీసి పక్కన పెట్టేస్తారు. కానీ దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు పక్కనపెట్టరు.

FOLLOW US: 
Share:

పలావ్ లేదా బిర్యానీ వండేటప్పుడు వచ్చే మసాలా వాసన అద్భుతంగా ఉంటుంది. ఆ వాసనే సగం కడుపు నింపేస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంత మంచి వాసన ఆ అన్నానికి రావడానికి కారణం అందులో వేసే సుగంధ ద్రవ్యాలే. బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి ఇలా రకరకాల సుగంధ ద్రవ్యాలు తాళింపులో వేస్తారు. బిర్యానికి అంత రుచి రావడానికి ప్రత్యేకమైన కారణం బిర్యానీ ఆకు. దీన్ని వేయడం వల్లే చేసే వంటకి అంత అధ్భుతమైన రుచి వస్తుంది. బిర్యానీ ఆకు చాలా ప్రసిద్ధి చెందినది. ఇంకొంతమంది నాన్న వెజ్ కూరల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. బాస్మతి రుచిని బిర్యానీ ఆకులు చక్కగా ఇస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

బిర్యానీ ఆకు వంటకి మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, బి 6, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అంతే కాదు జీవక్రియని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్, ఎలర్జీ ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. య్ అధ్యయనం ప్రకారం బిర్యానీ ఆకులు స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇకోలి పెరుగుదలని నిరోధిస్తాయి. ఇవే కాదు అల్సర్, క్యాన్సర్ కి కారణమయ్యే హెచ్ పైలోరీ బ్యాటిరియాతో పోరాదగలదని సదరు అధ్యయనం వెల్లడించింది. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలోను సహాయపడుతుంది.

అన్నం ఉడికేటప్పుడు కూడా ఈ ఆకులు అందులో వేయొచ్చు. బిర్యానీ లేదా పలావ్ వండే ముందు తాళింపులో వీటిని వేసుకున్నా దాని రుచి పదార్థానికి చక్కగా పడుతుంది. బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కాపర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించేందుకు బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ పేగు కదలికల్ని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే బిర్యానీ ఆకులతో చేసిన నీటిని లేదా టీని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహులకి ప్రయోజనమే..

ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్, రుమటాయిడ్ వంటి జబ్బుల నుంచి బయట పడొచ్చు. జీర్ణ సమస్యలని తొలగిస్తుంది. ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని నియంత్రిస్తుంది. ఇది మధుమేహులకి మేలు చేస్తుంది. హైపర్ టెన్షన్ నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. బిర్యానీ ఆకులతో తయారు చేసుకున్న టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.

చర్మ సంరక్షణకి

మొటిమలు తగ్గించడంతో పాటు చర్మాన్ని తాజగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది. చుండ్రుని నివారించి పేలు సమస్య పోయేలా చేస్తుంది. విటమిన్ ఏ లోపంతో బాధ పడే వాళ్ళు తరచూ బిర్యానీ ఆకు ఆహారంలో భాగం చేసుకుంటే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి

Also Read: పాల ఉత్పత్తులు చర్మ సంరక్షణకి పనికిరావా? నిపుణులు ఏం చెబుతున్నారు

Published at : 12 Oct 2022 12:15 PM (IST) Tags: Biryani weight loss Diabetis Bay Leaf Bea Leaf Benefits Bay Leaf Uses Biryani Taste Bay leaf

సంబంధిత కథనాలు

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం

Micro Oven:  మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి