News
News
X

Weight lose: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి

బరువు తగ్గడానికి ఏవేవో చేయాల్సిన పని లేదు. సింపుల్ గా ఈ ఆహారం తీసుకుంటే చాలు.

FOLLOW US: 

రువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఏవి తినకూడదు, ఏవి తినాలి అనేది డైట్ చార్ట్ పెట్టేసుకునే ఉంటారు. కానీ వాటిని క్రమం తప్పకుండా పాటించాలి అంటే మాత్రం కొంచెం కష్టమైన పని. చాక్లెట్స్, చిప్స్ కంటికి కనిపిస్తే చాలు డైట్ చార్ట్ మూలన పడిపోతుంది. జంక్ ఫుడ్స్ నోరూరించేస్తూ ఉండటం వల్ల బరువు తగ్గాలనే లక్ష్యం ఆటకెక్కిపోతుంది. అందుకే అటువంటి వాటికి దూరంగా ఉంటూ వాటికి బదులుగా ఆరోగ్యకరమైనవి ఎంపిక చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పోషకాలతో నిండిన తక్కువ క్యాలరీలు ఫుడ్ ఇంట్లో పెట్టుకుంటే మిగతా వాటి మీదకి దృష్టి వెళ్ళదు. సాయంత్రం స్నాక్స్ వేళ వీటిని తీసుకుంటే ఆరోగ్యమే కాదు బరువు అదుపులో ఉంటుంది.

ఓట్స్

బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మొదటిగా ఎంచుకునే ఫుడ్ ఓట్స్. దీనితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఉప్మా, పాలు ఇలా ఏ విధంగా అయిన ఓట్స్ తీసుకోవచ్చు. వాటిలో రుచిగా ఉండటం కోసం కొన్ని కూరగాయ ముక్కలు కూడా వేసుకుని తినవచ్చు. ఫైబర్ పొందేందుకు ఓట్స్ చక్కని ఎంపిక. కొంచెం తేనె, పాలు వేసి అందులో ఓట్స్ వేసుకుని ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. ఇది కొంచెం తీపి అనుభూతి ఇస్తుంది. అందులో కొంచెం కోకో జోడించారంటే చాక్లెట్ అయిపోతుంది. ఉప్పు కావాలని అనుకుంటే వాటిని నీటిలో ఉడికించి మసాలా దినుసులు వేసి, తరిగిన కూరగాయ ముక్కలు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఆకలిగా ఉన్న సమయంలో ఓట్స్ ని ఇతర పండ్లు లేదా గింజలు కలిపి ఓట్ మీల్ చేసుకుని తీసుకోవచ్చు.

వాల్ నట్స్

సూపర్ రిచ్ ఫుడ్ అంటే వాల్ నట్స్ గా చెప్పొచ్చు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండి. ప్రోటీన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. వాల్ నట్ లోని కొన్ని ముక్కలు చాలు మీ ఆకలిని దూరం చేసేస్తాయి. చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ప్యాక్ చేసిన చిరుతిండి తినడానికి బదులుగా నట్స్ నానబెట్టుకుని తింటే శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలని అందిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.

కోడిగుడ్లు

ఏడాది పొడవునా అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఇంట్లో ఫ్రిజ్ లో ఉండేవి కోడిగుడ్లు. ప్రోటీన్స్ కి గొప్ప మూలం గుడ్లు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు గుడ్డులోని పచ్చసొన తీసేసి తెల్ల సొన తినొచ్చు. 100 గ్రాముల గుడ్డులోని తెల్ల సొన 53 కేలరీలని కలిగి ఉంటుంది. ఇది సుమారు 7 పెద్ద గుడ్లులోని తెల్లసొనతో సమానం. ఇందులో 0.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 12 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదనపు కేలరీలు, కొవ్వు తీసుకోకుండా ఉండాలని అనుకుంటే గుడ్డులోని తెల్లసొన తీసుకోవచ్చు.

News Reels

బీట్ రూట్

బీట్ రూట్ రంగే చెప్పేస్తుంది, అది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. సలాడ్, కూర, జ్యూస్ ఇలా ఏ విధంగా అయినా బీట్ రూట్ తినొచ్చు. బీట్ రూట్ జ్యూస్ ఉదయం లేదా వర్కవుట్స్ చేసే ముందు డ్రింక్ గా తీసుకుంటే శక్తిని ఇస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసేందుకు అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. ఒకవేళ బీట్ రూట్ జ్యూస్ గా తీసుకుంటుంటే అందులోని ఫైబర్ మిస్ అవకుండా చూసుకోవాలి.

యాపిల్

రోజుకో యాపిల్ తింటే డాక్టర్  దగ్గరకి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్తారు నిపుణులు. అది అక్షరాలా నిజం. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. యాపిల్‌ లోని ఫైబర్ జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే జీవక్రియను మెరుగుపరిచచేందుకు  అవసరమైన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: పాల ఉత్పత్తులు చర్మ సంరక్షణకి పనికిరావా? నిపుణులు ఏం చెబుతున్నారు

Also Read: థైరాయిడ్ సమస్యా? ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా బయటపడొచ్చు

Published at : 11 Oct 2022 03:31 PM (IST) Tags: Apple Oats Weight Lose Weight Loss Food Sitrus Foods Oatmeal

సంబంధిత కథనాలు

Kids: శీతాకాలంలో పిల్లలకి  కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Kids: శీతాకాలంలో పిల్లలకి కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Hair Care: కరివేపాకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం

Hair Care: కరివేపాకులతో  ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం

Ragi Cake: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి

Ragi Cake: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి

స్పైసీ ఫుడ్ తిన్నాక మండిపోతున్న ఫీలింగ్ తగ్గాలంటే వీటిని తినాలి

స్పైసీ ఫుడ్ తిన్నాక మండిపోతున్న ఫీలింగ్ తగ్గాలంటే వీటిని తినాలి

Freezer: ఈ ఆహార పదార్థాలు అసలు ఫ్రిజ్‌లో నిల్వ చెయ్యకండి

Freezer: ఈ ఆహార పదార్థాలు అసలు ఫ్రిజ్‌లో నిల్వ చెయ్యకండి

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?