News
News
X

Thyroid: థైరాయిడ్ సమస్యా? ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా బయటపడొచ్చు

థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఆడవారిలోనే కనిపిస్తుంది. దీని వల్ల విపరీతంగా బరువు పెరిగిపోవడం జరుగుతుంది. థైరాయిడ్ సమస్య నుంచి బయట పడాలంటే ఈ ఆహారాన్ని మీ డైట్లో భాగం చేసుకోవాల్సిందే..

FOLLOW US: 

జీవక్రియని నియంత్రించే హార్మోన్లు థైరాయిడ్ గ్రంథి నుంచే విడుదల అవుతాయి. మెడ దగ్గర గొంతు లోపల కాలర్ బోన్ పైన సీతాకోక చిలుక రూపంలో ఈ చిన్న గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది. థైరాయిడ్ బ్యాలెన్స్ గా లేకపోతే అది శరీరానికి సరిపడినంత హార్మోన్లను విడుదల చెయ్యలేదు. ఈ గ్రంథిలో ఏదైనా సమస్య వస్తే అలసట, జలుబు, జుట్టు రాలడం, అకస్మాత్తుగా బరువు పెరిగిపోవడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. వాటిని అధిగమించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారంతో పాటు మందులు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లక్షణాలు తగ్గించుకోవచ్చు. వాటితో పాటు ఆహారంలో అయోడిన్, కాల్షియం, విటమిన్ డి విరివిగా తీసుకోవాలి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం శరీరంలో థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. గర్భిణులకి తప్పని సరిగా థైరాయిడ్ పరీక్ష రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమస్య ఉంటే తల్లికి చనుబాలు రాకుండా అడ్డుకుంటుంది. అందువల్లే ఈ సమస్య రాకుండా తప్పనిసరిగా చూసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ తినాలి. అవేంటంటే..

గుమ్మడి కాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాలని గ్రహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. శరీరంలోని థైరాయిడ్ విడుదల చేసే హార్మోన్లని సమతుల్యం చేసేలా ప్రోత్సాహిస్తుంది. ఎండిన గుమ్మడి గింజలను ప్రతి రోజు ఒక ఔన్స్ తినడం ద్వారా శరీరానికి సరిపడా జింక్ పొందవచ్చు.

ఉసిరికాయ

ఉసిరికాయలో నారింజ కంటే ఎనిమిది రెట్లు, దానిమ్మ కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి పొందేందుకు అవసరమైన అద్భుతమైన సూపర్ ఫుడ్ ఇది. జుట్టు రాలే సమస్యకి కూడా ఇది చెక్ పెడుతుంది. జుట్టు నెరవకుండా చేసేందుకు దోహదపడుతుంది. అంతే కాదు చుండ్రుని నివారించి, హెయిర్ ఫోలికల్స్ ని బలపరుస్తుంది. తలకి రక్తప్రసరణ మెరుగ్గా అయ్యేలా చేసి జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది.

News Reels

పెసలు

పెసల్లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ అసమతుల్యతని తగ్గించడంతో పాటు  మలబద్ధక సమస్యని నివారిస్తుంది. అయోడిన్ ని అందిస్తాయి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. అందుకే ఫ్రెండ్లీ డైట్ గా వీటికి పేరు ఉంది. చాలా మంది బరువు తగ్గేందుకు వీటిని మొలకలుగా చేసుకుని తింటారు.

ఇవే కాదు సీజనల్ వారీగా వచ్చే పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీస్, నారింగా వంటిని తీసుకోవచ్చు. అలాగే ఈ గ్రంథి పనితీరుకు ఆటంకం కలగకూడదు అంతే కాఫీ, మద్యపానానికి దూరంగా ఉండాలి. గ్లూటెన్ రిచ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. గోధుమలు, బార్లీ వంటి ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్ గ్రంథి వాపుని పెంచుతాయి. అందుకే గ్లూటెన్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎంచుకోవాలి.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: ఈ ఆకులు రోజూ నమిలితే కంటి చూపు సూపర్, భవిష్యత్తులో సైట్ వచ్చే అవకాశమే ఉండదు

Also read: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే అయిదు అద్భుతమైన ఆహారాలు ఇవిగో, వీటిని రోజూ తినండి

Published at : 11 Oct 2022 01:21 PM (IST) Tags: super food Thyroid Problems Thyroid Imbalance Thyroid Problems Remedie Food For Thyroid

సంబంధిత కథనాలు

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి

Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?