Skin Care: పాల ఉత్పత్తులు చర్మ సంరక్షణకి పనికిరావా? నిపుణులు ఏం చెబుతున్నారు
చర్మ సంరక్షణ కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. వాటిలో పాల ఉత్పత్తులు కూడా ఉంటాయి.
పాలు, ఇతర పాల పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు బలంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన చర్మం కోసం ఎన్నో సంవత్సరాలుగా పాల ఉత్పత్తులు మంచివని తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పాల మీగడతో ఫేస్ స్క్రబ్ చేయడం వల్ల మొహం మీద ఉన్న జిడ్డు, మృతకణాలు తొలగిపోతాయని ఈ పద్ధతి ఉపయోగిస్తారు. అందులో కొద్దిగా పసుపు కూడా జోడిస్తారు. కానీ డైరీ ఉత్పత్తులు చర్మ ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తామర, మొటిమలు, చర్మం నిస్తేజంగా మారడం అనేది పాల ఉత్పత్తుల వల్లే జరుగుతుందని అంటున్నారు. మొటిమలు రావడంలో పాల ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హార్మోన్ల పెరుగుదలపై ప్రభావం
ఆవు పాలు, పాల ఉత్పత్తుల్లో కేసైన్ వంటి ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్-1(IGF-1), ప్రొలాక్టిన్, ప్రోస్టాగ్లాండిన్స్, స్టెరాయిడ్స్ వంటి కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతాయి. పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు తరచుగా వాటికి రీకాంబినెంట్ బోవిన్ గ్రోత్ హార్మోన్ అనే సింథటిక్ హార్మోన్‌తో చికిత్స చేస్తారు. ఈ హార్మోన్లలో మరీ ముఖ్యంగా IGF-1 సెబమ్ తో ముడిపడి ఉంటుంది. ఇది చర్మంలోని నూనె వచ్చేలా చేయడంతో పాటు రంధ్రాలని అడ్డుకుంటుంది. మొటిమలని వచ్చేలా చేస్తుంది.
ఇన్సులిన్ స్థాయిలో పెరుగుదల
డెయిరీ అనేది ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా చక్కెర వంటి పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలకి అంతరాయం కలిగించి హార్మోన్లలో అసమతుల్యతకి కారణం అవుతుంది. మనం తీసుకునే డెయిరీ ప్రొడక్ట్స్ ఇన్సులిన్ తో సమానమైన ప్రోటీన్లతో కలిసిపోతుంది. దీని వల్ల ఇన్సులిన్ స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇన్సులిన్ పెరగడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్స్ కి గురి చేస్తుంది. మొటిమలు, తామర, రొసెసియా వంటి పరిస్థితులకి కారణం అవుతుంది. అకాంథోసిస్ నైగ్రికన్స్, అమిలోయిడోసిస్, పిగ్మెంటేషన్, చర్మం పొడి బారడం వంటి చర్మ సమస్యలకి దారి తీస్తుంది. కొల్లాజెన్ తగ్గించి వృద్ధాప్య సంకేతాలు వచ్చేలా చేస్తుంది.
పాల ఉత్పత్తుల వల్ల అనార్థాలు
డెయిరీ ప్రొడక్ట్స్‌లో లాక్టోస్ అనేది సహజంగా లభించే చక్కెర. శరీరంలోని షుగర్ ని విచ్చిన్నం చేయడానికి లాక్టోస్ అనే ఎంజైమ్ ఉపయోగిస్తారు. అయితే ప్రతి ఒక్కరికీ వచ్చే చర్మ సమస్యలు పాల ఉత్పత్తుల వల్ల వచ్చే అవకాశం లేదు. అయితే వాటిని పాల ఉత్పత్తులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఒత్తిడి, హార్మోన్లు, నిద్ర, కాలుష్యం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కూడా చర్మానికి హాని కలిగిస్తాయి.
అన్ని రకాల పాల ఉత్పత్తులు చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. కెఫీన్, పెరుగు, చీజ్, పులియబెట్టిన పాల ఉత్పత్తులు గుండె, ఎముకల ఆరోగ్యానికి హాని చేస్తాయి. అంతే కాదు జీర్ణక్రియ, బరువు విషయంలో కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే పాల ఉత్పత్తులు మితంగా, సమతుల్యంగా మాత్రమే తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: థైరాయిడ్ సమస్యా? ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా బయటపడొచ్చు
Also read: ఈ ఆకులు రోజూ నమిలితే కంటి చూపు సూపర్, భవిష్యత్తులో సైట్ వచ్చే అవకాశమే ఉండదు